ఇప్పుడు చేయండి చీటింగ్: ఎగ్జామ్ సెంటర్స్ లో షూస్ బ్యాన్

  • Published By: venkaiahnaidu ,Published On : February 21, 2019 / 11:55 AM IST
ఇప్పుడు చేయండి చీటింగ్: ఎగ్జామ్ సెంటర్స్ లో షూస్ బ్యాన్

పదో తరగతి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులు షూస్ వేసుకోవడాన్ని నిషేధిస్తూ   బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. షూస్ వేసుకొని ఎగ్జామ్స్ రాయడానికి వీల్లేదని, చెప్పులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు నితీష్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యార్థులు చీటింగ్ కు పాల్పడే అవకాశమివ్వకూడదన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

గురువారం(ఫిబ్రవరి-21,2019) నుంచి బీహార్ లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆర్డర్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 16లక్షలకు పైగా విద్యార్థులు చెప్పులు ధరించి పరీక్షకు హాజరయ్యారు. అంతేకాకుండా రబ్బర్లు,బ్లేడ్ లపై కూడా నిషేధం విధించినట్లు బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ తెలిపింది. పరీక్షా సమయానికంటే 10నిమిషాల ముందే పరీక్షా కేంద్రాలకు రావాలని విద్యార్థులను కోరింది.  ప్రతి ఒక్క పరీక్షా కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువమందిగా గుంపుగా ఉండటంపై కూడా అధికారులు నిషేధం విధించారు. విద్యార్థులు చీటింగ్ కు పాల్పడకుండా సెక్యూరిటీ ఫోర్స్ ని నియమించారు.మొదటిసారిగా ఆన్సర్ షీట్ పై విద్యార్థుల రోల్ నంబర్ తో పాటుగా,పేరు, ఇతర వివరాలు కూడా ప్రింట్ అయ్యాయని, ఎగ్జామ్ హాల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, కట్టుదిట్టంగా పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో  432 మంది విద్యార్ధులు చీటింగ్ కి పాల్పడి పట్టుబడ్డారని,బీహార్ లో విద్యార్థుల చీటింగ్  ఎప్పుడూ పెద్ద సమస్య అని, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఆర్డర్ కారణంగా విద్యార్థులు చీటింగ్ కి పాల్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Read Also:చింతమనేని కంప్లయింట్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అరెస్టు
Read Also:అగస్త్యకూడంపై తొలి మహిళ : చరిత్ర సృష్టించిన ధన్య సనాల్
Read Also:కడప నేతలతో చంద్రబాబు భేటి.. అభ్యర్ధులు వీరేనా!