కుంభమేళాలో కరోనా కల్లోలం.. 5 రోజుల్లోనే 1700 కేసులు

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో కరోనా కలకలం రేపింది. ఐదు రోజుల వ్యవధిలోనే అక్కడ 1701మంది కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. కుంభమేళా జరిగిన ప్రదేశంలో ఏప్రిల్‌ 10 నుంచి 14 వరకు మొత్తంగా 2లక్షల 36వేల 751

కుంభమేళాలో కరోనా కల్లోలం.. 5 రోజుల్లోనే 1700 కేసులు

Kumbh Mela Covid 19

Kumbh Mela Covid 19 : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో కరోనా కలకలం రేపింది. ఐదు రోజుల వ్యవధిలోనే అక్కడ 1701మంది కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. కుంభమేళా జరిగిన ప్రదేశంలో ఏప్రిల్‌ 10 నుంచి 14 వరకు మొత్తంగా 2లక్షల 36వేల 751 శాంపిల్స్‌ పరీక్షించగా..1701మందికి పాజిటివ్‌గా తేలిందని అధికారులు వెల్లడించారు. భక్తులతో పాటు పలువురు సాధువులకు ఆర్టీ పీసీఆర్‌, ర్యాపిండ్‌ యాంటీ జెన్‌ పరీక్షలు నిర్వహించారు. ఇంకా కొన్ని పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 2వేలకు చేరే అవకాశం ఉందని హరిద్వార్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ శంభూకుమార్‌ ఝా తెలిపారు.

Kumbh Mela

కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం. లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. పుణ్య స్నానాలు ఆచరిస్తారు. కుంభమేళా 670 హెక్టార్లలో వ్యాపించి ఉంది. హరిద్వార్, టెహ్రి, డెహ్రాడూన్, రిషికేష్ జిల్లాల్లోని ప్రాంతాలను కలుపుతుంది.

Kumbh Mela

చివరి రెండు రోజులు షాహీ స్నాన్ లో 48.51లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని అంచనా. ఏప్రిల్ 12న సోమ్ వతి అమావాస్య, ఏప్రిల్ 14న మేష్ సంక్రాంతి.ఈ సందర్భంగా భక్తులు కుంభమేళాకు పోటెత్తారు. కాగా, భక్తులు కొవిడ్ నిబంధనలకు నీళ్లు వదిలారు. మాస్కులు లేవు. భౌతిక దూరం అసలే లేదు. కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడటంలో ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు ఉన్నాయి. భక్తులను నియంత్రించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. అయితే, కుంభమేళాను ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ తో పోల్చద్దని ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

కుంభమేళాను కుదించలేం:
హరిద్వార్‌‌లో జరుగుతున్న కుంభమేళాకు లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. పవిత్ర స్నానాలు చేసేందుకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో కుంభమేళా రోజులను తగ్గించాలని పలువురి నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. దీనిపై ఉత్తరాఖండ్‌ అధికారులు స్పందించారు. మహా కుంభమేళా ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుందని స్పష్టంచేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కుంభమేళాను నిలిపివేసేందుకు ఎలాంటి చర్చ జరుగలేదన్నారు.

రెండు వారాల ముందుగానే కుంభమేళాను ముగిస్తారన్న వార్తలను కుంభమేళా అధికారి దీపక్ రావత్ ఖండించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుంభమేళా తేదీలను కేంద్రం కుదించనున్నట్లు వార్తలు రాగా, దీనిపై ఎలాంటి సమాచారం అందలేదని రావత్‌ చెప్పారు. ప్రభుత్వం, మత పెద్దల మధ్య చర్చలు జరిగినప్పటికీ.. అవి సఫలం కాలేదన్నారు. కుంభమేళా తేదీల కుదింపు ప్రక్రియను ఎవరూ అంగీకరించరని తెలిపారు.

లక్షల సంఖ్యలో భక్తులు:
ఇదిలా ఉంటే.. హరిద్వార్‌లో పవిత్ర స్నానాలు చేసేందుకు వస్తున్న భక్తులు చాలామంది కరోనా బారిన పడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రద్దీ లేని ఘాట్లలో పకడ్భందీగా కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. ప్రధాన ఘాట్లలో రద్దీగా ఉన్న చోట్ల జరిమానాల విధింపు చాలా కష్టమని అధికారులు తెలిపారు. కుంభమేళాలో భాగంగా 27న పెద్ద ఎత్తున భక్తులు మూడో షాహీ స్నానాలు ఆచరించేందుకు వస్తారు.