Covid Cases In Kerala : కేరళలో వరుసగా నాలుగో రోజూ 20వేలకు పైగా కోవిడ్ కేసులు

కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.

10TV Telugu News

Covid Cases In Kerala కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు కూడా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం కేరళలో 20,772 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఒక్క మలప్పురం జిల్లాలోనే అత్యధికంగా 3670 కేసులు నమోదైనట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,52,639 టెస్టులు చేయగా..టెస్ట్ పాజిటివీ రేటు 13.61శాతంగా ఉన్నట్లు కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక,గడిచిన 24 గంట్లలో 116 మంది కోవిడ్ తో మరణించినట్లు తెలిపింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,70,137కు, మొత్తం మరణాల సంఖ్య 16,701కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1,52,639 టెస్టులు చేయగా..టెస్ట్ పాజిటివీ రేటు 13.61శాతంగా ఉన్నట్లు కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది.

మరోవైపు గత 24 గంటల్లో 14,651 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 31,92,104కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,60,824 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ ఉన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా నమోదయ్యే మొత్తం కోవిడ్ కేసుల్లో 50 శాతం కేసులు ఒక్క కేరళ నుంచే నమోదవుతున్నాయి.

10TV Telugu News