Delhi Police: మూడొందల మంది పోలీసులకు కరోనా పాజిటివ్!

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

Delhi Police: మూడొందల మంది పోలీసులకు కరోనా పాజిటివ్!

Corona Out Break

Delhi Police: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, బాధితుల చికిత్సకు శరవేగంగా చర్యలు తీసుకుంటోంది అక్కడి కేజ్రివాల్ ప్రభుత్వం. అయినా కూడా ప్రతీరోజూ కేసులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఓమిక్రాన్ ముప్పు మధ్య, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వేగం ఇప్పుడు పూర్తిగా నియంత్రించలేనిదిగా మారింది.

కోవిడ్ -19 నివారణ కోసం ఢిల్లీ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్ తర్వాత కూడా, దాని వేగంపై గణనీయమైన ప్రభావం కనిపించడం లేదు. లేటెస్ట్‌గా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO), అదనపు కమిషనర్ చిన్మోయ్ బిస్వాల్‌తో సహా 300 మందికి పైగా ఢిల్లీ పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం ఢిల్లీలో కరోనా సానుకూలత రేటు 23.53 శాతంగా ఉంది. అదే సమయంలో, గడిచిన 24 గంటల్లో 10 వేల 179 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 60 వేల 733 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఢిల్లీలో కరోనా మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

ఢిల్లీ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం, గత 24 గంటల్లో 22వేల 751కరోనా కేసులు నమోదు కాగా.. 17 మంది మరణించారు. అదే సమయంలో, శనివారం ఏడుగురు కరోనాతో మరణించారు.