Coivd-19 Vaccines : దేశంలో 40 కోట్ల మార్క్‌ను దాటిన కోవిడ్ వ్యాక్సినేషన్

దేశంలో శనివారం ఇచ్చిన 46.38లక్షల డోసుల టీకాలతో కలిపి దేశంలో టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 40 కోట్లు మార్కును దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

Coivd-19 Vaccines : దేశంలో 40 కోట్ల మార్క్‌ను దాటిన కోవిడ్ వ్యాక్సినేషన్

Corona Vaccine

Coivd-19 Vaccines : దేశంలో శనివారం ఇచ్చిన 46.38లక్షల డోసుల టీకాలతో కలిపి దేశంలో టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 40 కోట్లు మార్కును దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. శనివారం 21,18,682 మంది తొలి డోసు వ్యాక్సిన్ వేయించుకోగా…2,33,019 మంది రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.

దీంతో దేశంలో మొత్తం వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య 40.49 కోట్లు దాటింది.  2020 నుంచి కోవిడ్ నిబంధనలు ఉండటంతో దేశంలో టీబీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి.శనివారం దేశ వ్యాప్తంగా 41,157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు 518 మంది కోవిడ్ కారణంగా మరణించారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ తదితర కారణాలతో మరణించిన వారి సంఖ్య 4,13,609 కి పెరిగింది.

నిన్న దేశవ్యాప్తంగా 42,004 మంది కోవిడ్ కు చికిత్స పొంది ఆస్పత్రినుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారిసంఖ్య 3,02,69,796కి చేరింది. దేశంలో ప్రస్తుతం 4,22,660 యాక్టివ్ కేసులుండగా…. రికవరీ రేటు 97.31 శాతంగా ఉంది.coivd-19 vaccines