COVID-19 Vaccine: భారత్ మరో విజయం.. తొలిరోజే 40 లక్షల మంది పిల్లలకు వ్యాక్సిన్‌

దేశవ్యాప్తంగా 15 నుంచి 17 ఏళ్ల లోపు అర్హులైన టీనేజర్లకు కోవిడ్ తొలి డోసు ఇచ్చే ప్రక్రియ మొదలైంది.

COVID-19 Vaccine: భారత్ మరో విజయం.. తొలిరోజే 40 లక్షల మంది పిల్లలకు వ్యాక్సిన్‌

COVID19 vaccine

COVID-19 Vaccine: దేశవ్యాప్తంగా 15 నుంచి 17 ఏళ్ల లోపు అర్హులైన టీనేజర్లకు కోవిడ్ తొలి డోసు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. తొలి రోజైన సోమవారంనాడు 37 లక్షల మందికి పైగా టీనేజర్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు. కోవిన్ పోర్టల్ వివరాల ప్రకారం, రాత్రి 7 గంటల వరకూ 37,84,212 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.

దేశంలో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమం నేటి నుంచి మొదలైంది. మొదటి రోజైన సోమవారం(3 జనవరి 2021) 40 లక్షల మంది యువకులు ఫస్ట్ డోస్ యాంటీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.

భారత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇది మరో విజయం. మొదటి రోజు రాత్రి 8 గంటల సమయానికి, 15-18 సంవత్సరాల వయస్సు గల 40 లక్షల మందికి పైగా పిల్లలు మొదటి డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను పొందారు.

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా అర్హులైన టీనేజర్లు సుమారు 10 కోట్ల మంది వరకూ ఉన్నారు.

మొదటి రోజున టీకాలు వేసుకున్నవారిని, వేసినవారిని, వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసి అభినందించారు. జనవరి 3 నుంచి దేశవ్యాప్తంగా జరిగే కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులను చేర్చనున్నట్లు డిసెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.