పెళ్లిభోజనం తిని 70మందికి అస్వస్థత

పెళ్లిభోజనం తిని  70మందికి అస్వస్థత

odisha ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపారా జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివారం పెళ్లిభోజనం తిన్న 70మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే హాస్పిటల్ తరలించారు స్థానికులు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… నింపుర్ గ్రామానికి చెందిన దాదాపు 70మంది పెళ్లివేడుకకు హాజరయ్యేందుకు తెరాడ్ ఘర్ గ్రామంలోని వధువు ఇంటికి శనివారం రాత్రి వెళ్లారు. వధువు కుటుంబం ఏర్పాటు చేసిన రిసెప్షన్ లో వీరందరూ ఫుడ్ తిన్నారు.

అయితే ఆదివారం ఉదయం పెళ్లి రిసెప్షన్ లో పాల్గొన్న 50మందికి పైగా కడుపు నొప్పి,వాంతులతో బాధపడ్డారు. పట్టముందరి సబ్ డివిజినల్ హాస్పిటల్లో వీరందిరిని ట్రీట్మెంట్ కోసం చేర్చారు స్థానికులు. బాధితుల్లో ఇద్దరి ఆరోగ్యం విషమించడంతో వారిని వేరే హాస్పిటల్ కి మెరుగైన ట్రీట్మెంట్ కోసం తరలించారు. మిగిలినవారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఆహారం కల్తీ అవడంవల్లే ఇలా జరిగినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.బాధితుల్లో చాలా మంది విరేచనాలతో బాధపడుతున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.