Unemployment : 60 లక్షల జాబ్స్ పోయాయి

  • Published By: madhu ,Published On : September 18, 2020 / 11:18 AM IST
Unemployment : 60 లక్షల జాబ్స్ పోయాయి

White collar professionals : కరోనా వైరస్ ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపెట్టింది. దిక్కుమాలిన వైరస్ కారణంగా…లక్షలాది వైట్ కాలర్స్ ప్రోఫెషనల్స్ జాబ్స్ తుడిచిపెట్టుకపోయాయి. ఈ సంవత్సరం మే – ఆగస్టు నెలలో ఏకంగా 60 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఏకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది.



https://10tv.in/no-leg-but-he-is-working-on-the-farm-video-viral/
ఇందులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల నుంచి మొదలుకుని టీచర్లు, అకౌంటెంట్లు, ఫిజీషియన్లు..ఇలా ఎంతో మంది ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్న తేడా లేకుండా…ఉద్యోగాలకు దూరమైనట్లు వెల్లడించింది. గత సంవత్సరం మే నుంచి ఆగస్టు నెలల్లో దేశంలో వైట్ కాలర్ వర్కర్లు 1.88 కోట్లుగా ఉన్నారని, ఈ ఏడాది మే – ఆగస్టు నాటికి 1.22 కోట్లకు పడిపోయారని తెలిపింది.



ఇక పరిశ్రమలో పని చేసే కార్మికుల పరస్థితి చెప్పనవసరం లేదు. ఈ నాలుగు నెలల కాలంలో 50 లక్షల మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారని అంచనా వేసింది. గత సంవత్సరంతో పోలిస్తే..26 శాతం ఉపాధి రేటు పడిపోయిందని తెలుస్తోంది. అయితే..ఆగస్టు నెల వచ్చే సరికి పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని తెలిపింది.