Covid Vaccine : కోవిడ్ వ్యాక్సినేష‌న్‌లో కొత్త మైలురాయి.. 70 కోట్ల మందికి టీకాలు

కరోనా కట్టడి కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ముమ్మరంగా సాగుతోంది. 18ఏళ్లు పైబడిన వారందరికి ప్రభుత్వం టీకాలు ఇస్తోంది. కాగా, కోవిడ్ వ్యాక్సినేష‌న్‌లో కొత్త మైలురాయిని..

Covid Vaccine : కోవిడ్ వ్యాక్సినేష‌న్‌లో కొత్త మైలురాయి.. 70 కోట్ల మందికి టీకాలు

Covid Vaccine

Covid Vaccine : కరోనా కట్టడి కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ముమ్మరంగా సాగుతోంది. 18ఏళ్లు పైబడిన వారందరికి ప్రభుత్వం టీకాలు ఇస్తోంది. కాగా, కోవిడ్ వ్యాక్సినేష‌న్‌లో కొత్త మైలురాయిని అందుకున్నాం. భారత్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 70 కోట్ల మంది క‌రోనా టీకాలు ఇచ్చేశారు. ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ తెలిపారు.

WhatsApp End : ఈ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎప్పటినుంచో తెలుసా?

Coronavirus

గ‌డిచిన 13 రోజుల్లోనే ప‌ది కోట్ల మంది కోవిడ్ టీకాలు ఇచ్చిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దిగ్విజయంగా 70 కోట్లకు చేరుకుందంటూ మాండవీయ ట్వీట్‌ చేశారు. ఈ ఘ‌న‌త సాధించినందుకు హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు, ప్ర‌జ‌ల‌కు మంత్రి మాండ‌వీయ అభినందనలు చెప్పారు. తొలి ప‌ది కోట్ల డోసుల‌ను 85 రోజుల్లో, 20 కోట్ల టీకాల‌ను 45 రోజుల్లో, 30 కోట్ల డోసుల‌ను 29 రోజుల్లో, 40 కోట్ల డోసుల‌ను 24 రోజుల్లో, 50 కోట్ల డోసుల‌ను 20 రోజుల్లో, 60 కోట్ల డోసుల‌ను 19 రోజుల్లో, ఇక 70 కోట్ల డోసుల‌ను 13 రోజుల్లో ఇచ్చిన‌ట్లు మంత్రి తెలిపారు. ‘సబ్‌కో వ్యాక్సిన్ ముఫ్త్ వ్యాక్సిన్’ అంటూ మంత్రి ట్యాగ్ చేశారు.

Apple Next iPhones : భారీగా పెరగనున్న ఐఫోన్ల ధరలు.. అసలు కారణం ఇదే!

India seeks vaccine

సోమవారం ఒక్కరోజే కోటి మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ, సెప్టెంబర్‌ నెలలో సాధించిన రికార్డు ఇదని, ఒక్కరోజే కోటి వ్యాక్సినేషన్ల మార్క్‌ను టచ్ చేశామని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌గా దీనిని అభివర్ణించారు. జనవరి 16న దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ముందుగా హెల్త్ వర్కర్లకు టీకాలు ఇచ్చారు. మార్చి 1న రెండో ఫేజ్(45 ఏళ్లు నుంచి 60ఏళ్లు) వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. మూడో ఫేజ్ ఏప్రిల్ 1న మొదలైంది. 18 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మే 1న మొదలైంది. కరోనా వైరస్‌కు చెక్‌ పెట్టాలంటే టీకాతోనే సాధ్యమని.. అందరూ వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడే మనం వైరస్‌ను ఓడించగలమని ఆయన తెలిపారు.

COVID-19