Farmers’ protest : ఢిల్లీ ఆందోళనల్లో వృద్ధులు..వీరి వయస్సు ఎంతో తెలుసా

Farmers’ protest : ఢిల్లీ ఆందోళనల్లో వృద్ధులు..వీరి వయస్సు ఎంతో తెలుసా

Over 90 years old farm protest Delhi : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఎంతో మంది రైతన్నలు ఢిల్లీ సరిహద్దుల వెంబడి గడ్డకట్ట చలిలో బైఠాయించి తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల్లో వయస్సు మళ్లిన వారు ఉండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆందోళనలు, నిరసనలకు వయస్సు అడ్డు కాదంటూ వారు నిరూపిస్తున్నారు. ఏకంగా..80 నుంచి 90 ఏళ్లు ఉన్న వృద్ధులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

RAJE SINGH, SHYAM SINGH

Rajesh Singh, Shyam Singh :-

శీతాకాలంలో చలి గాలులు తట్టుకుంటూ..ఇతరులకు మార్గనిర్దేశం చేస్తున్న రైతులు మీడియా దృష్టిని ఆకర్షించారు. Ghazipur సరిహద్దు వద్ద ముడుతలు పడిన ఇద్దరు వృద్ధులు గట్టిచెక్క కర్రల సహాయంతో…నడుస్తున్నారు. 97 ఏళ్ల రాజే సింగ్, 90 ఏళ్ల శ్యామ్ సింగ్ వీరి పేర్లు. వీరిద్దరూ పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చారు. శ్యామ్ సింగ్ సిక్కు కాగా..రాజేసింగ్..షామ్లీ జాతికి చెందిన వారు. ఆకు పచ్చని టోపి Bharatiya Kisan Union (BKU) ధరించి తాము ఆందోనల్లో పాల్గొంటామన్నారు. విజయం తమదయ్యే వరకు ఇక్కడి నుంచి వెళ్లమని శ్యామ్ సింగ్ స్పష్టం చేశారు.

ARIF

Arif :-

యు ఆకారపు లాఠీని పట్టుకుని..నేలమీద నిశబ్దంగా ఓ వృద్ధుడు కూర్చొన్నాడు. ఇతని పేరు ఆరీఫ్ (Arif). 90 సంవత్సరాలు. ముజఫర్ నగర్ ప్రాంతానికి చెందిన ఇతను..ఆందోళనల్లో పాల్గొంటున్నాడు. తాను ఉపయోగించే కర్ర..వివిధ ప్రయోజనాలకు ఉపయోగించవచ్చని వెల్లడించారు. తన జీవితమంతా..ఆందోళనల్లో ఒక భాగమని, కానీ..ఈ నిరసన పూర్తిగా భిన్నంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆరీఫ్. చాలా మందిని కలుసుకున్నా..ఇతర మతాలు, కులాలకు చెందిన వారు ఎంతో మంది ఉన్నారని వెల్లడించారు. రైతులకు మేలు చేసేంత వరకు ఇక్కడి నుంచి కదలని 90 సంవత్సరాలున్న Arif కూడా స్పష్టం చేయడం విశేషం.
JEET SINGH

SARDAAR JEET SINGH :-తన తోటి ఆందోళనకారులతో SARDAAR JEET SINGH, 89 బిజీగా ఉన్నారు. చాలా చురుకుగా ఉన్న ఇతనికి 89 సంవత్సరాలు అంటే నమ్మడం కష్టం. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి వస్తున్న రైతుల కోసం తాను వేచి ఉన్నట్లు, అందుకే ఇక్కడకు వచ్చినట్లు జీత్ సింగ్ వెల్లడించారు. ఆందోళన సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉందని, అందుకు సిద్ధంగా ఉండాలని ఇతరులకు సూచిస్తున్నారాయన. హిందీ, ఇంగ్లీషు
భాషలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు కనిపించింది. కానీ..అందరి రైతుల్లాగే..అదే విషయం చెబుతున్నాడు. ఓడిపోవడానికి సిద్ధంగా లేమని వెల్లడిస్తున్నారు జీత్ సింగ్.
JAGBEER

JAGBEER :-ఢిల్లీలో ఆందోళన చేపడుతున్న రైతుల్లో JAGBEER ఒకరు. ఇతని వయస్సు 85. ముజఫర్ నగర్ లోని సిసౌలిలో నివాసం ఉంటున్నారు. దాదాపు 35 సంవత్సరాల క్రితం భారతీయ కిసాన్ యూనియన్‌లో (Bharatiya Kisan Union) చేరారు. 1980లో Baba Mahendra Singh Tikait నాయకత్వంలో…BKUలో చేరినప్పుడు తాను ఇంకా చురుకుగా ఉన్నానని అప్పటి విషయాలను గుర్తు చేశారాయన. నిరసన స్థలంలో ఓ చిన్న దుకాణం నడుపుతున్నాడు. సంస్థకు సంబంధించిన ఫొటోలు, టోపీలు, జెండాలు, బ్యాడ్జ్‌లను చాలా తక్కువ ధరకు పొందవచ్చంటున్నాడు. తన జీవితం రైతుల కోసం అంకితం చేయబడిందని, బ్రతికే వరకు ఇలాగే ఉంటానని చెప్పడం విశేషం. మొత్తానికి ఈ వయస్సులో కూడా చేస్తున్న ఆందోళన పలువురికి స్పూర్తిగా ఉందంటున్నారు కొందరు.