Nine lakh fake coins: రూ.9 ల‌క్ష‌ల విలువైన న‌కిలీ రూ.1, రూ.5, రూ.10 కాయిన్స్ స్వాధీనం

ముంబైలో రూ.9 ల‌క్ష‌ల‌కు పైగా విలువైన న‌కిలీ నాణేల‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బస్తాల్లో న‌కిలీ రూ.1, రూ.5, రూ.10 నాణేలు ల‌భ్య‌మ‌య్యాయి. న‌కిలీ నాణేల‌పై స‌మాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ముంబైకి వెళ్లి సోదాలు చేశారు. మ‌లాద్ ప్రాంతం వ‌ల్లభ్ బిల్డింగ్ మీదుగా వెళ్తున్న‌ ఓ కారును త‌నిఖీ చేయ‌గా, అందులో కొన్ని బ‌స్తాలు క‌న‌ప‌డ్డాయి.

Nine lakh fake coins: ముంబైలో రూ.9 ల‌క్ష‌ల‌కు పైగా విలువైన న‌కిలీ నాణేల‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బస్తాల్లో న‌కిలీ రూ.1, రూ.5, రూ.10 నాణేలు ల‌భ్య‌మ‌య్యాయి. న‌కిలీ నాణేల‌పై స‌మాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ముంబైకి వెళ్లి సోదాలు చేశారు. మ‌లాద్ ప్రాంతం వ‌ల్లభ్ బిల్డింగ్ మీదుగా వెళ్తున్న‌ ఓ కారును త‌నిఖీ చేయ‌గా, అందులో కొన్ని బ‌స్తాలు క‌న‌ప‌డ్డాయి.

వాటిని పోలీసులు తెరిచి చూడ‌గా అందులో నాణేలు దొరికాయి. జిగ్నేశ్ గాలా అనే 42 ఏళ్ల ఓ వ్య‌క్తిని అరెస్టు చేశామ‌ని తెలిపారు. అత‌డిని ఢిల్లీ పోలీసుల‌కు అప్ప‌గించారు. మొత్తం రూ.9.46 ల‌క్ష‌ల నకిలీ నాణేలు దొరికాయ‌ని చెప్పారు. హ‌రియాణాలో న‌కిలీ నాణేల కర్మాగారం ఉంద‌ని, దానిపై దాడి చేసిన స్పెషల్ సెల్ అధికారులు అయిదుగురిని అరెస్టు చేశార‌ని పోలీసులు తెలిపారు.

ఈ నేప‌థ్యంలోనే ముంబైకి కారులో పెద్ద ఎత్తున‌ న‌కిలీ నాణేలు వెళ్లాయ‌ని గుర్తించి అక్క‌డ‌కు వెళ్లి ప‌ట్టుకున్నామ‌ని చెప్పారు. ప్రార్థ‌నా మందిరాల వ‌ద్ద నిందితులు న‌కీలీ నాణేల‌ను మార్చుతున్న‌ట్లు గుర్తించామ‌ని తెలిపారు. ఈ వ్య‌వ‌హారం చాలా కాలంగా కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని వివరించారు.

Australian Currency Elizabeth : ఆస్ట్రేలియా కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్-2 ఫొటో తొలగింపు

ట్రెండింగ్ వార్తలు