మాస్క్‌లు ధరించని వాళ్లకు రూ.2లక్షలకు పైగా జరిమానా

  • Published By: Subhan ,Published On : May 5, 2020 / 06:21 AM IST
మాస్క్‌లు ధరించని వాళ్లకు రూ.2లక్షలకు పైగా జరిమానా

కరోనా వస్తుంద్రా అయ్యా మాస్క్ లు పెట్టుకోండి అంటే పట్టించుకోకుండా తిరుగుతున్నారని.. ఫైన్లు వేయడం మొదలుపెట్టారు. ఏ పది మందో ఇరవై మందో అయితే వేలల్లో ఉండేదేమో.. నిర్లక్ష్యంగా తిరిగే వారి సంఖ్య ఎంత భారీగా ఉంటే రూ.2లక్షల 39వేల 505జరిమానాలు వసూలు చేస్తారు అధికారులు. ఇది కేవలం బృహత్ బెంగళూరు మహానగర్ పాలికే(BBMP)ఆ ఒక్క మునిసిపాలిటీకే ఇన్ని లక్షల నిధులు వచ్చి పడ్డాయి. 

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా తిరిగితే రూ.1000జరిమానా.. విధించాలని బెంగళూరు మునిసిపాలిటీ నిర్ణయించింది. రెండో సారి మాస్క్ లేకుండానే కనిపిస్తే రూ.2వేలు ఫైన్. ఈ జరిమానాను రివైజ్ చేస్తూ.. మునిసిపల్ ప్రాంతాల పరిధిలో రూ.200 ఫైన్.. ఇతర ప్రాంతాల్లో రూ.100గా నిర్ణయించింది ప్రభుత్వం. కొత్తగా నిర్ణయించిన జరిమానాలను బట్టి.. బీబీఎంపీ రూ.51వేల 700జరిమానా వసూలు చేసింది. 

ఆదివారం రూ.98వేల 350కాగా, సోమవారం రూ.89వేల 455వసూలు చేసింది. సిటీలోని ఈస్ట్ జోన్ లో ఎక్కువ కేసులు నమోదై రూ.21వేల 305 వసూలు అయినట్లు అధికారులు చెప్తున్నారు. బొమ్మనహల్లీ జోన్ లో రూ.16వేల 200వసూలుగా కాగా, మహదేవపురా జోన్లో రూ.15వేలు, వెస్ట్ జోన్లో రూ.14వేల 800, దసరహల్లి జోన్లో రూ.10వేలు వసూలు అయ్యాయి. 

సోమవారం నుంచి లాక్ డౌన్ నియమాలు సడలించి.. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకూ మాత్రమే తిరగాలని నిర్ణయించారు. పోలీసులు పాట్రోలింగ్ నిర్వహించి ప్రత్యేకంగా లిక్కర్ షాపులపైనే నిఘా పెట్టారు. సామాజిక దూరం పాటిస్తూనే లైన్లలో నిల్చోవాలని సూచించారు. 

Also Read |   Lockdown తర్వాత..IAPSM నివేదిక