ICMR scientist: భయపెడుతోన్న ఆగస్ట్.. రోజుకు లక్ష కేసులు.. కరోనాకు అడ్డుకట్ట ఎస్ఎంఎస్ మాత్రమే!

అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు సడలించడం.. పర్యాటకులు హిల్ స్టేషన్లకు తరలిరావడంతో, మనకే తెలియకుండా మన వెనుక ప్రమాదం పెరిగిపోతుందని అంటున్నారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్) సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సమిరన్ పాండా.

ICMR scientist: భయపెడుతోన్న ఆగస్ట్.. రోజుకు లక్ష కేసులు.. కరోనాకు అడ్డుకట్ట ఎస్ఎంఎస్ మాత్రమే!

Icmr Scientist

COVID-19 Third Wave: అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు సడలించడం.. పర్యాటకులు హిల్ స్టేషన్లకు తరలిరావడంతో, మనకే తెలియకుండా మన వెనుక ప్రమాదం పెరిగిపోతుందని అంటున్నారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్) సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సమిరన్ పాండా. ఆగస్టు చివరిలో కోవిడ్ -19 మూడవ వేవ్ భారతదేశాన్ని తాకే అవకాశం ఉందని, దేశంలో ప్రతిరోజూ దాదాపు ఒక లక్ష కేసులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరించారు.

మూడవ వేవ్ తీవ్రతను ప్రస్తావిస్తూ మాట్లాడిన ప్రొఫెసర్ పాండా.. వైరస్ పరివర్తన చెందకపోతే, పరిస్థితి మొదటి వేవ్ మాదిరిగానే ఉంటుందని, కానీ వైరస్ మ్యూటేషన్ మారితే, పరిస్థితులు అధ్వాన్నంగా తయారవ్వొచ్చునని చెప్పారు ప్రొఫెసర్ పాండా.

అయితే, మూడవ వేవ్ మాత్రం రెండవ వేవ్ ప్రభావం కంటే తక్కువగానే ఉండొచ్చని, సెకండ్ వేవ్ మాదిరిగా నాశనం చేయకపోవచ్చునని చెప్పుకొచ్చారు పాండా. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో వేయకుండా ఆంక్షలు సడలించడం వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని, లండన్ ఇంపీరియల్ కాలేజ్‌తో పాటు ఐసీఎంఆర్ చేసిన గణిత మోడలింగ్‌లో వెల్లడైనట్లు చెప్పారు.

ప్రస్తుత పరిస్థితిని చూస్తే, మూడవ వేవ్ కచ్చితంగా ఉంటుందని ఎవరైనా కనిపెట్టేస్తారని ప్రొఫెసర్ పాండా చెప్పారు. సామూహిక సమావేశాలను నివారించడం మరియు మాస్క్‌లు ధరించడం వంటి పనుల వల్ల సంక్రమణ వ్యాప్తిని అరికట్టవచ్చునని చెప్పారు పాండా.

భారతదేశం వ్యాక్సిన్ వేసే వేగం పెంచి ఎస్‌.ఎం.ఎస్‌ అనే మూడు పద్ధతులను పాటిస్తే.. ఎస్‌ అంటే సోషల్‌ డిస్టన్స్‌…(మనిషికి మనిషికి కనీసం 6 అడుగులు దూరం) ఎం.. అంటే మాస్క్‌. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టగానే విధిగా మాస్క్‌ ధరించడం, ఎస్.. శానిటైజేషన్.. తరచూ చేతులను శానిటైజర్లతో కాని, సబ్బుతో కాని శుభ్రం చేసుకోవడం, ఇంటికి వెళ్లిన వెంటనే స్నానం చేయడం, సాధ్యం కాని పరిస్థితుల్లో చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవడం వంటి పనులు చెయ్యడం వల్ల కరోనా మూడో వేవ్‌ రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చునని చెప్పుకొచ్చారు.

COVID-19 కి వ్యతిరేకంగా పోరాటంలో రాబోయే 100-125 రోజులు కీలకం అని హెచ్చరిస్తున్నారు. ఆగస్ట్ చివరినాటికి కోవిడ్-19 కేసులు రోజుకు లక్ష లెక్కన నమోదు కావచ్చునని చెప్పుకొచ్చారు ఐసీఎంఆర్ సైంటిస్ట్‌లు.