‘ఓట్ కట్టర్’ ఓవైసీ, సెక్యులర్ పార్టీలు జాగ్రత్తగా ఉండాలి: కాంగ్రెస్

  • Published By: vamsi ,Published On : November 11, 2020 / 07:59 AM IST
‘ఓట్ కట్టర్’ ఓవైసీ, సెక్యులర్ పార్టీలు జాగ్రత్తగా ఉండాలి: కాంగ్రెస్

బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో 24 అసెంబ్లీ సీట్లు ఉండగా.. వీటిలో సగానికి పైగా సీట్లలో ముస్లిం జనాభానే మెజార్టీ. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ఇక్కడే ఐదు సీట్లు కైవసం చేసుకుంది. అంతేకాదు మిగిలిన చోట్ల కూడా కాంగ్రెస్, ఆర్‌జేడీ సారధ్యంలోని మహాకూటమిపై ప్రభావం చూపింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎంఐఎం పార్టీ విషయంలో సెక్యులర్ పార్టీలు జాగ్రత్తగా ఉండాలంటూ కాంగ్రెస్ అంటుంది.



కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.., ఓవైసీని “ఓటు కట్టర్” గా అభివర్ణించారు. ఎంఐఎంతో కలిసే విషయంలో లౌకిక పార్టీలను “అప్రమత్తంగా” ఉండాలని కోరారు.”బీహార్ ఎన్నికలలో అసదుద్దీన్ ఒవైసీ పార్టీని ఉపయోగించుకుని బీజేపీ వేసిన వ్యూహం కొంతవరకు విజయవంతం అయ్యింది అని, ఓటు కట్టర్ ఓవైసీ సాహబ్ విషయంలో అన్నీ లౌకిక పార్టీలు అప్రమత్తంగా ఉండాలి” అని ఆయన అన్నారు.



అయితే కాంగ్రెస్ చేసిన విమర్శలపై స్పందించిన AIMIM ప్రతినిధి అసిమ్ వకార్, “మమ్మల్ని ఓటు కట్టర్‌గా పిలిచేవారికి తగిన సమాధానం ఈ ఎన్నికల్లో ఐదు సీట్లలో విజయంతో లభించింది అని, వారి నోరు భవిష్యత్తులో మూసుకుంటుంది” అని అన్నారు. వాస్తవానికి మహాకూటమిలో ‘కీ’రోల్ పాటిస్తున్న RJDకి సంప్రదాయ ఓటు బ్యాంకు యాదవులతో పాటు ముస్లింలు.. అయితే ఈ ఎన్నికల్లో ఎంఐఎం వారి ఓట్లను బాగా చీల్చింది. ఐదు స్థానాల్లో గెలుపొందడమే కాకుండా.. చాలా స్థానాల్లో RJD ఓట్లను చీల్చింది. అంతిమంగా మహాకూటమికి ముఖ్యమంత్రి పీఠాన్ని దూరం చేసింది.
https://10tv.in/owaisis-mim-wins-5-seats-in-seemanchal-dents-mgb/



కానీ ‘ముస్లిం ఓటర్లు తమకుంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నారని, బీజేపీని ఓడించే ఓటు బ్యాంకుగా మాత్రమే తమని చూడటం వారికి నచ్చట్లేదని. తమ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వారు ఆశిస్తున్నారు’’ అని అందుకే ఎంఐఎంకు ఓటు వేశారని అంటున్నారు.