‘బెంగాల్‌లోని ముస్లింలను కూడా అవమానించినట్లే’

‘బెంగాల్‌లోని ముస్లింలను కూడా అవమానించినట్లే’

తృణమూల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మమతా బెనర్జీ వ్యాఖ్యలకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటైన సమాధానం ఇచ్చారు. కూచ్‌బెహర్ ర్యాలీలో భాగంగా మాట్లాడిన మమతా.. పేరు ప్రస్తావించకుండా హైదరాబాద్ కేంద్రంగా ఓ పార్టీ ‘మైనారిటీ అతివాద’ పార్టీగా సామజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని ఆరోపించారు. వీటిపై స్పందించిన ఒవైసీ ఎంఐఎం పశ్చిమబెంగాల్ లో తిరుగులేని శక్తిగా ఎదిగిందనే విషయాన్ని ఒప్పుకుందన్నారు. 

తన పైనా, తమ పైనా తప్పుడు ఆరోపణలు చేస్తూ ముస్లింలకు పిలుపునిస్తుందని విమర్శించారు. భయాలు, నిరాశలు కారణంగానే ఇలాంటి వ్యాఖ్యలకు దిగుతున్నారని అన్నారు. పశ్చిమబెంగాల్‌లో కేవలం 2 సీట్లు ఉన్న బీజేపీ సంవత్సరారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్న సంగతి గుర్తు చేశారు. 

‘మేం హైదరాబాద్ నుంచి వచ్చి మైనారిటీలను రెచ్చగొడుతుంటే పశ్చిమబెంగాల్‌లో బీజేపీ 18లోక్ సభ స్థానాలను ఎలా గెలుచుకుంది. మేం న్యాయం కోసం పోరాడుతున్నాం. దీనిని సీఎం అలానే అనుకుని అతివాదం జరుగుతుందని అంటే నాతో పాటు బెంగాల్ లోని ముస్లింలను అవమానించినట్లే’ అని ఎదురుదాడికి దిగారు.