సత్తా చూపిన ఎంఐఎం…బీహార్‌ లో 5స్థానాల్లో విజయం

  • Published By: venkaiahnaidu ,Published On : November 11, 2020 / 07:33 AM IST
సత్తా చూపిన ఎంఐఎం…బీహార్‌ లో  5స్థానాల్లో విజయం

Owaisi’s MIM wins 5 seats in bihar బీహార్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ సత్తా చాటింది. ఐదు స్థానాల్లో విజయం సాధించిన ఏఐఎంఐఎం…మహాకూటమి ఓటమిలో తనవంతు పాత్ర పోషించింది. 5స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకోవటం ద్వారా హైదరాబాద్ బయటా కీలకంగా మారుతోందని చాటి చెప్పింది.

2015లో జరిగిన బిహార్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఐదుచోట్ల తన అభ్యర్థులను బరిలో దింపి అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఒక్క స్థానమూ దక్కలేదు. 2019లో కిషన్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే లోక్‌ సభకు పోటీ చేయటంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఏఐఎంఐఎం గెలుపొందడం ద్వారా బీహార్‌లో బోణీ కొట్టింది



ఆ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తాజా ఎన్నికల్లో గ్రాండ్‌ డెమొక్రాటిక్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (జీడీఎల్‌ఎఫ్‌)తో జత కట్టి 20 స్థానాల్లో అభ్యర్థులను నిలిపారు. ఇందులో ఐదుగురు గెలిచారు. మూడుచోట్ల గెలుపు అవకాశాలు ఉంటాయని ముందు నుంచీ పార్టీ నేతలు భావించారు. కానీ ఐదు సీట్లు రావటంతో ఆ పార్టీలో పండుగ వాతావరణం నెలకొంది. అయితే, 2019 ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కిషన్‌గంజ్‌లో ఓటమి చవిచూడటం గమనార్హం.



బీహార్‌లో ఏఐఎంఐఎం సాధించిన విజయం చాలా గొప్పదన్నారు పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.సిమాంచల్‌ అభివృద్ధి కోసమే తమ పోరాటమని స్పష్టం చేశారు. పరిస్థితులను బట్టి.. ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంపై తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.



https://10tv.in/rjd-accuses-nitish-kumar-sushil-modi-of-delaying-counting-in-10-seats/
ఇక,మొత్తంగా బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 125స్థానాల్లో విజయం సాధించగా,మహాకూటమి110 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ చతికిలపడటం.. కూటమిని నిండా ముంచింది. రాష్ట్రాన్ని 15ఏళ్ల పాటు పాలించిన నితీశ్​కుమార్​..ఎన్డీయే విజయంతో ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.