Rajasthan : పేలిన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌.. భార్య మృతి.. భర్తకు తీవ్ర గాయాలు

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పేలడంతో ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. కరోనా తర్వాత వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భర్తను ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తుంది భార్య. ఉపిరితీసుకోవడంతో సమస్య ఉండటంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ను కొన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే శనివారం పాఠశాలకు వెళ్లివచ్చిన భార్య ఇంట్లో లైట్ వేశారు. ఈ సమయంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఒక్కసారిగా పేలింది. దీంతో మహిళ మృతి చెందారు.

Rajasthan : పేలిన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌.. భార్య మృతి.. భర్తకు తీవ్ర గాయాలు

oxygen concentrator blast in rajasthan :  ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ పేలడంతో ఓ మహిళ మృతి చెందగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని గంగాపూర్ సమీపంలోని ఉదయ్ మోర్ ప్రాంతంలో సుల్తాన్ సింగ్, సంతోష్ మీనా దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే రెండు నెలల క్రితం సుల్తాన్ సింగ్ కరోనా బారినపడ్డారు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చారు.సుమారు 50 రోజులు ఆసుపత్రిలో ఉంచినా కరోనా నుంచి పూర్తిగా కోలుకోలేదు. కరోనా తర్వాత వచ్చే అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే రెండు వారాలక్రితం సుల్తాన్ సింగ్ ని డిశ్చార్జ్ చేశారు. ఆయన అప్పటినుంచి ఇంటివద్దే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఆయనను తన భార్య పర్యవేక్షిస్తుంది. టీచర్ గా పనిచేస్తున్న సంతోష్ శనివారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చారు. ఇంట్లో లైట్ స్విచ్ ఆన్ చేశారు. ఈ సమయంలోనే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ ఒక్కసారిగా పేలింది. భారీ శబ్దంతో పాటు పొగ కమ్ముకుంది. దీంతో చుట్టుపక్కలవారు వచ్చి సంతోష్ మీనా, ఆమె భర్త సుల్తాన్ సింగ్ లను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే సంతోషి మీనా మార్గమధ్యంలోనే మృతి చెందారు. సుల్తాన్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ చైనా తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ పేలి వ్యక్తి మృతి చెందడం ఇదే తొలిసారి. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.