Oxygen Plants: ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు..కరోనా కాలంలో ఇంట్లో ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే..

Oxygen Plants: ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు..కరోనా కాలంలో ఇంట్లో ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే..

Oxygen Plants

Oxygen Plants: ఆక్సిజన్..ఆక్సిజన్..ఆక్సిజన్. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో వినిపించే సర్వసాధారణమైన మాటగా మారిపోయింది ఆక్సిజన్. ఇది లేకపోతే మనిషే కాదు సమస్త ప్రాణికోటి చనిపోతుంది. ఆక్సిజన్ కావాలంటే పచ్చదనం ఉండాల్సిందే. మొక్కలుంటే ఆక్సిజన్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను ఇంట్లో పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

1

కరోనాను కాసేపు పక్కన పెడితే…మనం రోజూ సరిపడా ఆక్సిజన్ పీల్చుతున్నామా… మన ఇళ్లలోని గాలిలో సరిపడా ఆక్సిజన్ ఉంటోందా? అనే విషయం ఆలోచించాల్సిందే. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఇంట్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలే ఎండాకాలం. ఇంట్లో వేడి పెరుగుతూ ఉంటుంది. గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. దాంతో మనకు గాలి ఆడని ఫీలింగ్ కలుగుతుంది.

8

ఊపిరి పీల్చుకుంటున్నా..గాలి ఆడనట్లుగా ఉంటుంది. కాస్త ఇబ్బందికర పరిస్థితి. గాలి సరిపోనట్లుగా ఉంటుంది. ఆక్సిజన్ సరిగా అందకపోవడం అంటే అదే. అందుకే మనం ఇళ్లలోపల ఆక్సిజన్ మొక్కలు పెంచుకోవాలి. ఇవి బోలెడంత ఆక్సిజన్‌ను మనకిస్తాయి. అంతేకాదు ఎంతో ఆక్సిజన్ ను గాల్లోకి వదులుతాయి. వేడిని లాగేసుకుని చక్కటి ఆక్సిజన్ ను ఇస్తాయి. చాలా మంది ఇళ్లలోకే కాదు… ఇంటి వరండాలో, గార్డెన్‌లో పెంచుకోవడానికి కూడా ఆక్సిజన్ మొక్కల్ని పెంచుకుంటున్నారు. ఇవి ఇంటికి అందాన్ని ఇవ్వటమే కాకుండా చక్కటి ఆక్సిజన్ ను కూడా ఇస్తాయి. దీంతో ఇంటిలో ఉండే మనుషులు. పెంపుడు జంతువుల ఆరోగ్యాన్ని కూడా పెంచుతున్నాయని చెబుతున్నారు.

10

మనీప్లాంట్ 
సాధారణంగా ఆక్సిజన్ ఎక్కువగా ఇచ్చే (విడుదల) మొక్కలు రాత్రివేళ ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తాయనే పుకారు కూడా ఉంది. కానీ ఇది ఎంతమాత్రం కరెక్టు కాదంటున్నారు. ఈ మొక్కలు పగలైనా, రాత్రైనా అవి ఆక్సిజన్ నే విడుదల చేస్తాయి. ముఖ్యంగా మనీ ప్లాంట్ అంటాం కదూ..ఈ మొక్క 24 గంటలూ ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతీ ఇంటిలోను మనీ ప్లాంట్ ఉంటే చాలా మంచిది. మనీప్లాంట్ అంటే అది ఉండే ఇంటిలో డబ్బు ఉంటుందనుకుంటారు. ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఆరోగ్యం ఉంటే డబ్బు ఉన్నట్లే కదా..సో మనీప్లాంట్ పెంచుకోవటం చాలా చాలా మంచిది.

9

ఆక్సిజన్ మొక్కల్ని ఇంట్లో పెట్టాక… ఉదయం సమయంలో తప్ప రోజంతా వాటిపై ఎండ పడకుండా చూసుకోవాలి. అలాగే వారానికి ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే నీరు పొయ్యాలి. ప్రతీరోజు నీరు పోయాల్సిన అవసరం లేదు. అలాకాకుండా అదనంగా నీరు పోసినా అవి తీసుకోవు. అంటే పీల్చుకోవు.

Snake Plant

స్నేక్ ప్లాంట్
ఆక్సిజన్ ఎక్కువగా ఇచ్చే మొక్కల్లో స్నేక్ ప్లాంట్ కూడా ఒకటి. ఇది చాలా చాలా మంచిది. స్నేక్ ప్లాంట్ గాలిలో వున్న విషవాయువులను పీలుస్తుంది. మంచితేమను కలిగి వుండి దాని పరిసరాలలో సహజమైన తేమను ఏర్పరుస్తుంది. ఈ స్నేక్ ప్లాంట్‌కు విషవాయులను శోషించుకునే గుణం కూడా ఉంది. కాబట్టి గాలి కూడా స్వచ్ఛంగా మారుతుంది. ఇది ఎండ, నీడ.. రెండు చోట్ల బతుకుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని అంటారు. ఆరోగ్యాన్ని మించిన అదృష్టం ఏముంటుంది ఈ రోజుల్లో..ఆరోగ్యం ఉంటే ఎంత అదృష్టవంతుడివిరా అంటారు.

పీస్ లిల్లీ

అత్యంత శక్తివంతమైన ఇండోర్ ఎయిర్ ప్యూరిఫయర్లలో పీస్ లిల్లీ ఒకటి. నీడలో ఈ మొక్క చాలా సులభంగా ఎదుగుతుంది. అంటే దీనికి సూర్యరశ్మితో పనిలేదు. దీని పచ్చని ఆకులు, తెల్లని పువ్వులు సంవత్సరం పొడవునా వికసిస్తూనే ఉంటాయి.

16

ఆరోగ్యాన్నిచ్చే అలో వెరా (కలబంద)

అలో వెరా మీరు కొనాల్సిన పనిలేదు. మీ చుట్టుపక్కల ఎవరికైనా ఉంటే… దాని చుట్టూ చిన్న మొలకలు ఉంటాయి. ఆ మొలకలే మొక్కలవుతాయి. ఖర్చు లేకుండా వాటిని తెచ్చుకుని పెంచుకోవచ్చు. ఒక్క మొక్కతో వంద మొక్కలు తయారుచేసుకోవచ్చు.చర్మ సౌందర్యానికి పెట్టింది పేరు ఈ అలోవేరా.కలబంద చాలా బాగా పనిచేస్తుందనే విషయం తెలిసిందే. అలో వీరా జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా మందిచి. అయితే మొక్క రూపంలో కూడా ఇది మనకు మేలు చేస్తుంది. కలబంద మొక్కను చిన్న కుండీలో నాటి ఇంట్లో పెట్టుకుంటే మనం పీల్చే గాలిని శుద్ధి చేస్తుంది.

123

130
చైనీస్ ఎవర్‌గ్రీన్
ఈ మొక్కలు మనకు చాలా విరివిగా దొరుకుతాయి. అంతే ఈజీగా పెరుగుతాయి కూడా. తక్కువ కాంతి ఉండే ప్రదేశాల్లో వీటిని ఉంచితే మంచిది. వీటిని మీ బాత్ రూంలో పెంచుకుంటే గాలిలో మలినాలను తొలంచి స్వచ్ఛంగా మారుస్తుంది. అలాగే ఇంటి ఆవరణలో కూడా దీన్ని పెంచుకోవచ్చు.

Spider Plant

స్పైడర్ ప్లాంట్
ఈ మొక్కలు చూడటానికి చాలా అందంగా కనబడతాయి. అయితే వీటిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద ఉంచకూడదు. కానీ నేలమీద కుండీలలో ఉంచవచ్చు. ఈ మొక్కలు అలంకార ప్రయోజనాల కోసం ఉపయోగించబడవు, కానీ గాలిని శుద్ధి చేసే లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.

4

6

ఫిడిల్ లీఫ్ ప్లాంట్,ఎరకా పామ్ ప్లాంట్, క్రెస్ స్యూలా ఇలా ఈ మొక్కలు పెంచుకోండి… మంచి ఆక్సిజన్ పీల్చండి… ఆరోగ్యాన్ని కాపాడుకోండి.