Oxytocin : అధిక పాలకోసం ఆక్సిటోసిన్ ఇంజక్షన్…పశువులకే కాదు మనుషులకు నష్టమే!..

ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చిన గేదెలు, ఆవులు ఇచ్చిన పాలను తాగడం వల్ల మనుషుల్లోనూ చాలా రకాల దుష్ప ప్రభావాలు ఎదురవుతాయి.

Oxytocin : అధిక పాలకోసం ఆక్సిటోసిన్ ఇంజక్షన్…పశువులకే కాదు మనుషులకు నష్టమే!..

Oxytocin

Oxytocin : పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండడం కోసం చాలామంది ఆవులు, గేదెల్లో ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తుంటారు. వాస్తవానికి పాలిచ్చే ప్రతి పశువులోనూ పిట్యుటరీ గ్రంధిలో ఈ హార్మోన్ సహజసిద్ధంగానే ఉత్పత్తి అవుతుంది. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో ఈ ఆక్సిటోసిస్ హార్మోన్ ను ఇంజక్షన్ రూపంలో అందిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పాలు ఎక్కువగా వస్తాయన్న ప్రధాన ఉద్దేశమే.

ఆక్సిటోసిన్ ఇంజక్షన్ ఇవ్వటం వల్ల పాలు ఉత్పత్తి చేసే గ్రంథుల చుట్టూ ఉన్న కణాలు సంకోచ వ్యాకోచాలు చెందుతాయి. దీంతో లోపల ఉన్న కండరాలన్నీ బయటకు తోసేలా పాలు ఎక్కవగా ఇచ్చేలా ఉపయోగపడుతుంది. చాలా మంది రైతులు వీటిని ఇంజెక్షన్ రూపంలో రోజుకి ఒకటి నుంచి రెండు సార్లు అందిస్తున్నారు. దీని వల్ల పశువులకు తీవ్ర నష్టం అన్న విషయం రైతులు గుర్తించటంలేదు. ప్రభుత్వం దీన్ని అత్యవసరం అయితే కానీ ఉపయోగించకూడదని నిబంధన విధించినా క్షేత్ర స్థాయిలో ఫలితంలేకుండా పోతుంది.1960 ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు యానిమల్స్ యాక్ట్ లోని సెక్షన్ 12 ప్రకారం ఆక్సిటోసిన్ ని వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మడం, కొనడం రెండూ చట్టరిత్యా నేరంగా పరిగణిస్తారు.

ఆక్సిటోసిన్ ని తరచు ఉపయోగించడం వల్ల ఆ జంతువులకండరాలు సంకోచ, వ్యాకోచాలకు గురవుతాయి. దీని వల్ల చాలా నొప్పి పుడుతుంది. ఈ మందు ఎక్కువగా వాడిన ఆవులు, గేదెలు చాలా తక్కువ కాలంలోనే వట్టిపోతాయి. పిల్లలను కనే శక్తిని కోల్పోతాయి. పాలు కూడా ఎక్కువ రోజులు అందించలేవు. ఒకవేళ వచ్చినా పాల నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది.

ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చిన గేదెలు, ఆవులు ఇచ్చిన పాలను తాగడం వల్ల మనుషుల్లోనూ చాలా రకాల దుష్ప ప్రభావాలు ఎదురవుతాయి. హార్మోన్ల అసమతౌల్యత ఎదురవ్వడం, పిల్లల్లో రజస్వల అయ్యే వయసు చాలా తగ్గిపోవటం, చిన్న పిల్లల్లో కంటి చూపు వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. పిల్లల్లో జాండిస్ వచ్చే అవకాశాలు, గుండె కొట్టుకునే వేగం పెరగడం, తగ్గడం జరుగుతుంది. అంతేకాదు.. వాంతులు రావడం, కళ్లు తిరగడం, ముక్కులో ఇరిటేషన్, నొప్పి, బ్రెయిన్ సెల్స్ ని తగ్గించి మతిమరుపు సమస్యలు వస్తాయి.