OYO Layoff Employees: ఒయోలో భారీ మార్పులకు శ్రీకారం.. ఇంటిబాట పట్టనున్న 10శాతం మంది ఉద్యోగులు
2012 సంవత్సరంలో ఒయో స్టార్టప్ ను రితేశ్ అగర్వాల్ ప్రారంభించాడు. ఒయో రూమ్స్‌ను హోటల్స్, హోమ్ అని కూడా పిలుస్తారు. హోటల్స్ ను లీజుకు, ప్రాంచైజ్ కు ఇస్తుంది. ఒయో అధికారులు మొదట్లో బడ్జెట్ హోటళ్లకే ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు.

OYO Layoff Employees: పలు రంగాలకు చెందిన సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. టెక్, సోషల్ మీడియా సంస్థలతో పాటు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో కూడా ఇటీవల ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరిగింది. తాజాగా ఆన్‌లైన్ హోటల్ అగ్రిగేటర్ ఒయో లో కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ షురూ అయింది. డిసెంబర్ 3న ఉత్పత్తి, ఇంజనీరింగ్, కార్పొరేట్ ప్రధాన కార్యాలయం, ఒయో వెకేషన్ హోమ్స్ టీంలలో భాగమైన సుమారు 600 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. సంస్థ తాజా నిర్ణయంతో ఒయోలో ప్రస్తుతం 3,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 10శాతం ఉద్యోగులు ఇంటిబాట పట్టనున్నారు.
Delhi Oyo: ఓయో గదిలో వాగ్వాదం.. ప్రియురాలిని కాల్చి చంపిన ప్రియుడు
ఇదిలాఉంటే పలు విభాగాల నుంచి సుమారు 600 మంది ఉద్యోగులను తొలగిస్తున్న ఒయో.. సేల్స్ విభాగంలో కొత్తగా 250 మందిని రిక్రూట్ మెంట్ చేసుకోనున్నట్లు ఒయో కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయంపై ఒయో గ్రూప్ సీఈఓ, వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. మేం తొలగిస్తున్న ఉద్యోగుల్లో చాలా మందికి ఉపాధి పొందేలా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఒయో అభివృద్ధి చెందుతున్నప్పుడు, భవిష్యత్తు లో కొత్తవారిని తీసుకొనే అవకాశం వస్తే.. ప్రస్తుతం తొలగించిన వారికే మొదటి ప్రాధాన్యతనిస్తామని రితేష్ అగర్వాల్ అన్నారు. తొలగించిన ఉద్యోగులకు సుమారు మూడు నెలల వారిగా మెడికల్ ఇన్సూరెన్స్ కవర్ తో కొనసాగుతోందని పేర్కొన్నారు.
2012 సంవత్సరంలో ఒయో స్టార్టప్ ను రితేశ్ అగర్వాల్ ప్రారంభించాడు. ఒయో రూమ్స్‌ను హోటల్స్, హోమ్ అని కూడా పిలుస్తారు. హోటల్స్ ను లీజుకు, ప్రాంచైజ్ కు ఇస్తుంది. ఒయో అధికారులు మొదట్లో బడ్జెట్ హోటళ్లకే ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు. 2020 నాటికి 80 దేశాల్లోని 800 పట్టణాలకు ఒయో కంపెనీ విస్తరించింది. ప్రస్తుతం ఒయో చేతిలో 10 లక్షలకుపైగా రూమ్స్ ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీని లాభాల బాట పట్టించేందుకు, నిర్వహణ వ్యయం తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టినట్లు ఒయో సీఈవో తెలిపారు.