Booster Dose: ఆదివారం నుంచి 18ఏళ్లు పైబడ్డ అందరికీ బూస్టర్ షాట్స్

బూస్టర్ డోస్ వేసుకోవాలనుకునేవారికి కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఆదివారం నుంచి ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో బూస్డర్ డోసులు తీసుకోవచ్చని వెల్లడించింది. హెల్త్ కేర్ వర్కర్లు,

Booster Dose: ఆదివారం నుంచి 18ఏళ్లు పైబడ్డ అందరికీ బూస్టర్ షాట్స్

Booster Dose

Booster Dose: బూస్టర్ డోస్ వేసుకోవాలనుకునేవారికి కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఆదివారం నుంచి ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో బూస్డర్ డోసులు తీసుకోవచ్చని వెల్లడించింది. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ స్టాఫ్‌లతో పాటు 60ఏళ్ల పైబడ్డ వారికి ఉచితంగా ఇచ్చినట్లు కాకుండా మూడో డోసును కొనుగోలు చేయాల్సిందే.

గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో జరుగుతున్న ఫ్రీ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో మొదటి, రెండో డోస్ లు ఉచితంగా ఇస్తారు. దాంతో పాటు హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60ఏళ్లు పైబడ్డ వారికి ఉచితంగానే వ్యాక్సినేషన్ పూర్తి చేస్తారు’ అని గవర్నమెంట్ స్టేట్మెంట్ లో పేర్కొంది.

15 లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిలో 96శాతం మంది కొవిడ్ డోస్ ఒక్క శాతం తీసుకోగా.. 83శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. చాలా దేశాల్లో ఇన్ఫెక్షన్లు పెరుగుతుండటంతో బూస్డర్ డోస్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. కొందరు ఇండియన్లు థర్డ్ డోస్ అయిన బూస్టర్ డోస్ తీసుకోకుండా విదేశీయానం కష్టంగా భావిస్తున్నారని అందులో పేర్కొన్నారు.

Read Also: బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఫోకస్

ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో బూస్టర్ డోస్ వేసుకోకపోతే వ్యాక్సినేషన్ పూర్తికానట్లుగానే భావిస్తున్నారు.