భారత్‌పైకి మరోసారి పాక్ యుద్ధ విమానాలు

భారత్‌పైకి మరోసారి పాక్ యుద్ధ విమానాలు

పాక్ ఎయిర్‌ఫోర్స్ బలగాలు మరోసారి దాడికి యత్నిస్తోన్నట్లుగా తెలుస్తోంది. భారత మిలటరీ స్థావరాలపై దాడులు చేసేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో పాక్ యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. ఈ మేర పూంచ్ సెక్టార్‌లో యుద్ధ విమానాలను గమనించిన భారత్.. భద్రతాదళాలతో అప్రమత్తమైంది. దాంతో పాక్ విమానాలు తిరిగి వెళ్లిపోయాయి. 

భారత్ ఎయిర్ ఫోర్స్ బలగాలు లైన్ ఆఫ్ కంట్రోల్ వరకూ వెళ్లి దాడి చేయడంతో పాక్ బలగాలు కూడా భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తున్నాయట. మరో రకంగా చూస్తే.. దాడి ముందుగా భారత్ నుంచి  చేయాలని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లుగానూ అనిపిస్తోంది. 
Read Also : అభినందన్‌ పాక్ బోర్డర్‌లో దిగగానే ఏం జరిగింది?

బుధవారం పాక్‌పై పోరాడేందుకు బయల్దేరిన రెండు యుద్ధ విమానాల్లో ఒకటి భారత్‌లోనే కూలిపోవడంతో రెండోది పాకిస్తాన్‌లో పడిపోయింది. ఆ విమానానికి పైలట్‌గా ఉన్న అభినందన్‌ ప్రస్తుతం పాక్ అదుపులో ఉన్నాడు.  
Read Also : ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్స్ హై అలర్ట్ : సముద్రంలో పెట్రోలింగ్