ఢిల్లీలో వాయుకాలుష్యానికి పాక్,చైనాలే కారణం…బీజేపీ నాయకుడు

ఢిల్లీలో వాయుకాలుష్యానికి పాక్,చైనాలే కారణం…బీజేపీ నాయకుడు

దేశరాజధాని ఢిల్లీ,యూపీలో తీవ్ర వాయుకాలుష్యం నెలకొన్న సమయంలో యూపీ బీజేపీ నాయకుడు వినీత్ అగర్వాల్ షర్దా సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాయుకాలుష్య  పాపం పాకిస్థాన్, చైనా దేశాలదేనని బీజేపీ నాయకుడు వినీత్ అగర్వాల్ ఆరోపించారు. ఢిల్లీలోకి పాక్, చైనా దేశాలు విష వాయువులను వదిలి పెడుతున్నాయని వినీత్ అగర్వాల్ ఆరోపించారు. తమను భయపెట్టేందుకు పాక్,చైనా దేశాలు విషవాయువులను వదిలిపెడుతున్నాయని ఆయన తెలిపారు. 

దేశంలో మోడీ, అమిత్ షాలు ఘన విజయం సాధించాక నిరాశ చెందిన పాక్ ఇలా విషవాయువులను వదిలేస్తుందని ఆయన తెలిపారు. మహాభారతంలో కృష్ణార్జునుల్లా మోడీ, అమిత్ షాలు దేశంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే హర్యానా, పంజాబ్ రైతులు పంటపొలాల్లో వ్యర్థాలను దహనం చేయడం వల్ల కలుషిత వాయువులు వెలువడుతున్నాయని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించడంలో అర్థం లేదని వినీత్ అగర్వాల్ విమర్శించారు.