Sania Mirza: సానియా మీర్జాతో విడాకులు.. స్పందించిన షోయబ్ మాలిక్.. ఏం చెప్పాడంటే

భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకుల అంశంపై తొలిసారిగా షోయబ్ మాలిక్ స్పందించాడు. ఒక మీడియా సంస్థతో దీనిపై మాట్లాడాడు.

Sania Mirza: సానియా మీర్జాతో విడాకులు.. స్పందించిన షోయబ్ మాలిక్.. ఏం చెప్పాడంటే

Sania Mirza: ఒకప్పటి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంతకాలంగా అధికారికంగా ఎవరూ స్పందించలేదు. కానీ, ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు మాత్రం జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ అంశంపై మొదటిసారిగా షోయబ్ మాలిక్ స్పందించాడు.

Indian Man: మాజీ ప్రియురాలికి కాబోయే భర్త ఇంటి ముందు ప్రియుడి హల్‌చల్.. ఇంటి ముందు నిప్పు పెట్టినందుకు జైలు శిక్ష

తాజాగా షోయబ్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘‘అది మా వ్యక్తిగత విషయం. దీనిపై నేను కానీ.. లేదా నా భార్య సానియా కానీ సమాధానం ఇవ్వలేదు. మీరు ఈ విషయాన్ని వదిలేయండి’’ అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యల ద్వారా షోయబ్ మాలిక్ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో ఇరువురి విడాకుల విషయంలో ఇంకా అభిమానుల్లో అనుమనాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇజాన్ అనే నాలుగేళ్ల బాబు కూడా ఉన్నాడు. ఇద్దరూ దుబాయ్‌లో ఉంటున్నారు. అయితే, వీరి విడాకులపై కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో సానియా పెట్టే పోస్టులు కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ఉన్నాయి. సానియా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న కొన్ని ఫొటోల్లో షోయబ్ ఉండటం లేదు.

UK Army: బ్రిటన్ ఆర్మీపై జంతు హక్కుల రక్షణ సంస్థ ‘పెటా’ కేసు.. తమ టోపీలు వాడేలా చూడాలని పిటిషన్

అలాగే సానియా సన్నిహితులు కొందరు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ వాళ్లిద్దరూ ఇప్పటికే విడాకులు తీసుకుని, వేరుగా ఉంటున్నారని చెప్పారు. ఒకవైపు విడాకుల ప్రచారం జరుగుతుంటే ఇద్దరూ కలిసి ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం కలిసి షో చేస్తున్నారు. ‘ఉర్దూఫ్లిక్స్’ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం ‘ద మాలిక్ మీర్జా షో’ పేరుతో ఒక షో చేస్తున్నారు. ఇది త్వరలోనే ప్రారంభం కానుంది.