దేశద్రోహి అంట : యుద్ధం వద్దంటే ఉద్యోగం తీసేశారు

దేశద్రోహి అంట : యుద్ధం వద్దంటే ఉద్యోగం తీసేశారు

శాంతి ప్రవచనాలు పలుకుతున్న టీచరమ్మను సైడ్ చేశారు. టీవీ ఛానెల్ లైవ్ లో ఆ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలకు అంత ఘాటైన స్పందన వస్తుందని ఊహించలేదేమో పాపం. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(కేఐఐటీ) యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ విభాగంలో మధుమిత రే ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 

పుల్వామా దాడి తర్వాత కొద్ది రోజులకు 2019 ఫిబ్రవరి 18న టీవీలో లైవ్ డిబేట్‌లో పాల్గొనేందుకు ఇండియన్ ఆర్మీ మాజీ కల్నల్ పూర్ణ చంద్ర పట్నాయక్‌ను, ప్రొఫెసర్ మధుమిత రేను ఆహ్వానించింది ఓ మీడియా ఛానెల్. పుల్వామా దాడికి ప్రతి చర్యగా పాక్‌పై భారత్ యుద్ధం చేయడం సరికాదంటూ మధుమిత తెలిపారు. 
Also Read : బుద్ధిమారదు అంతే : పాకిస్థాన్ కు చిల్లిగవ్వ ఇచ్చేదిలేదు

అంతే, ఫిబ్రవరి 20న మధుమితను 24 గంటల్లోగా విధులలో నుంచి తప్పుకోవాలని కాలేజి మేనేజ్‌మెంట్ ఆదేశించిందట. తప్పని పరిస్థితుల్లో ఆ తర్వాతి రోజే రాజీనామా చేసి కాలేజి నుంచి బయటకి వచ్చేసినట్లు ఆమె ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాకుండా, తనను దేశద్రోహి అని కాలేజీ యాజమాన్యం ముద్రవేసి పంపినట్లు చెప్తూ ఆవేదన చెందారు. 

‘యూనివర్సిటీ డిసిప్లినరీ కమిటీ స్టూడెంట్స్ అంతా దేశ ద్రోహి అంటోందని, ఆర్మీకి, యుద్ధానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు అందరిలోనూ నాపై వ్యతిరేకత కలిగేలా చేశాయని ఆరోపించారు. రెగ్యూలర్ ఉద్యోగిగా నాకు నెల రోజుల నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా వెంటనే వెళ్లిపొమ్మని ఆదేశించడంతో 24 గంటల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంతకీ నేం చెప్పిందానికి ఇప్పటికీ కట్టుబడి ఉంటా. యుద్ధమే అన్నిటీకి సమాధానం కాదు కదా’ అని మధుమిత రే తన వ్యాఖ్యలపై స్పందించారు. 
Also Read : అర్థరాత్రి యుద్ధం : పాక్ విమానాలు వెంటాడినా.. భారత్ పైటర్లు చిక్కలేదా!