కోర్టుల్లో పిటీషన్లు : అభినందన్ విడుదలపై పాక్ మంత్రుల కొర్రీలు

భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తోంది. ఈ సమయంలో పాక్ మరోసారి తన కపట బుద్ధి ప్రదర్శించింది. అభినందన్ విడుదలను సవాల్ చేస్తూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.

  • Published By: venkaiahnaidu ,Published On : March 1, 2019 / 06:34 AM IST
కోర్టుల్లో పిటీషన్లు : అభినందన్ విడుదలపై పాక్ మంత్రుల కొర్రీలు

భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తోంది. ఈ సమయంలో పాక్ మరోసారి తన కపట బుద్ధి ప్రదర్శించింది. అభినందన్ విడుదలను సవాల్ చేస్తూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.

భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తోంది. ఈ సమయంలో పాక్ మరోసారి తన కపట బుద్ధి ప్రదర్శించింది. అభినందన్ విడుదలను సవాల్ చేస్తూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. అభినందన్ ను భారత్ కు అప్పగించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని  అవామీ ముస్లిం లీగ్ పార్టీ అధినేత, పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్  ఆ దేశ పార్లమెంట్ లో అన్నారు. అభినందన్ భారత్ కు తిరిగి వెళ్లిన తర్వాత భారత్ తమపై దాడులు చేస్తుందని అన్నారు. ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ క్యాంప్ పాకిస్తాన్ లోని కైబర్-ఫత్ తున్ క్వా ప్రాంతంలోని జబ్బాలో ఉందని అన్నారు.
Read Also : అభినందన్ ను భారత హైకమిషన్ కు అప్పగించిన పాక్

దివంగత భారత మాజీ ప్రధాని వాజ్ పేయి హయాంలో ఇలాంటి పరిస్థితులు లేవని, ప్రస్తుత ప్రధాని మోడీ ఆలోచనలు వేరుగా ఉన్నాయన్నారు. లోక్ సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈ అటాక్ కి మోడీ ప్లాన్ చేశారని ప్రజలు చెప్పుకుంటున్నారని అన్నారు.  పైలట్ అభినందన్ ను అప్పగించిన తర్వాత భారత్ తమపై అటాక్ చేస్తే పరిస్థితి ఏంటని, అక్కడ ఉన్నది మోడీ అని తాను చెప్పదల్చుకున్నానని, శనివారమే తమపై భారత్ దాడి చేస్తుందని, భారత్ లో నివసిస్తున్న ప్రతి ముస్లిం పాక్ వైపు చూస్తున్నాడని అన్నారు.
Read Also : షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్

కార్గిల్ యుద్ధ సమయంలో ఒక యుద్ధ విమానం కూలిపోయి పాక్ లో పడిపోయిందని, భారత యుద్ధ విమానాలు మాత్రం కార్గిల్ ను క్రాస్ చేయలేదన్నారు. ఈసారి మాత్రం 14 భారత యుద్ధ విమానాలు పాక్ లోని జబ్బాలోని మసూద్ అజార్ మదర్సా  ఉన్న చోటుకి ప్రవేశించాయని అన్నారు. అక్కడ మదర్సా తాలిబన్ ఉన్నది నిజమేనని ఒప్పుకున్నారు.

అభినందన్ ను శుక్రవారం(మార్చి-1,2019) విడుదల చేస్తున్నట్లు గురువారం  పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్  ఆ దేశ పార్లమెంట్ లో ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also : మనుషులు బతకాలంటే…ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయాల్సిందే