Delhi : భారతీయ మహిళతో పాక్ ఉగ్రవాది వివాహం?..విస్తుగొలిపే విషయాలు

పోలీసుల విచారణలో ఉగ్రవాదికి సంబంధించని విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గత 15 ఏళ్లుగా భారతదేశంలో ఉంటున్నట్లు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Delhi : భారతీయ మహిళతో పాక్ ఉగ్రవాది వివాహం?..విస్తుగొలిపే విషయాలు

Pak

Pak Terrorist : భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ పన్నిన భారీ కుట్ర భగ్నమైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్టును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులను భారత్‌లోకి పాకిస్తాన్‌ పంపుతున్న విషయం మరోసారి బట్టబయలైంది. అయితే…పోలీసుల విచారణలో ఉగ్రవాదికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గత 15 ఏళ్లుగా భారతదేశంలో ఉంటున్నట్లు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇండియన్ పాస్ పోర్టుతో థాయిలాండ్, సౌదీ అరేబియాలో తిరిగాడని పోలీసులు భావిస్తున్నారు.

Read More : WhatsApp Voice Feature: వాట్సప్ వాయీస్ మెసేజ్‌ల కోసం కొత్త ఫీచర్

ఇండియాలో ఉండేందుకు సరైన పత్రాల కోసం…ఓ భారతీయ మహిళను వివాహం చేసుకున్నాడని, బీహార్ లో ఇండియన్ ఐడీ పొందారనే విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాల ద్వారా…నకిలీ భారతీయ కార్డులను పొందాడు. ఇతను మొహ్మద్ అష్రఫ్ అలియాస్ ఆలీ గా గుర్తించారు. ఇతను పాక్ లోని పంజాబ్ లో నివాసం ఉండేవాడిగా గుర్తించారు. ఢిల్లీలో శాస్త్రి నగర్ లో అలీ అహ్మద్ నూరీ పేరిట భారతీయ పౌరుడిగా జీవిస్తున్నాడని తేలింది.

Read More : ‘Cordyceps sinensis’ : హిమాలయాల్లో పెరిగే ఈ ఫంగస్‌తో క్యాన్సర్‌కు మెడిసిన్ : ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల వెల్లడి

మొదట వివాహం చేసుకోవడానికి నిరాకరించినట్లు, మరో మహిళతో నివసించినట్లు…తర్వాత ఆమె నుంచి విడిపోయానని పేర్కొన్నట్లు, దీనిని ఢిల్లీ పోలీసులు ధృవీకరించినట్లు సమాచారం. అతను ఓ బోధకుడిగా జీవిస్తూ…మంత్ర విద్యలను అభ్యసించేవాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలోకి ఎక్కడకు వెళ్లినా… ‘maulvi’ జీవించేవాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడి ఫోన్ లో పాక్ ఐఎస్ఐ ఫోన్ నెంబర్లు అనేకం కనుగొన్నారని, అతను భారతదేశంపై పెద్ద ఎత్తున దాడి చేయాలని వ్యూహం రచించాడని పోలీసులు భావిస్తున్నారు.

Read More : Bengaluru : విద్యార్థులు అదృశ్యం, అందులో ఒకరు కాలేజీ స్టూడెంట్..ఎందుకు వెళ్లారో తెలుసా ?

అరెస్టు చేసిన సమయంలో..అనేక ఆయుధాలు, మందుగుండు సామాగ్రీతో పాటు AK 47 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ కుశ్వాహ వెల్లడించారు. 60 రౌండ్లతో రెండు మ్యాగజైన్ లు, ఓ హ్యాండ్ గ్రనైడ్, 50 రకాల కాట్రిడ్జ్ లతో రెండు పిస్టల్ లు కూడా అతని నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పలు చట్టాల కిందట నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.