వీడియో : పాక్ అదుపులో భారత్ పైలెట్ : చిత్రహింసలు పెడుతున్నారు

  • Published By: veegamteam ,Published On : February 27, 2019 / 10:43 AM IST
వీడియో : పాక్ అదుపులో భారత్ పైలెట్ : చిత్రహింసలు పెడుతున్నారు

పాకిస్తాన్ భూభాగంలో భారత్ కు చెందిన మిగ్ 21 విమానం కూలిపోవడంతో అందులో ఉన్న పైలెట్ అభినందన్ వర్తమాన్ పాక్ సైనికుల చేతికి చిక్కారు. పాక్ సైనికులు ఆయన పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ప్రమాదంలో గాయాల బారిన పడిన అభినందన్ పై జాలి, దయ లేకుండా అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్దంగా పాక్ సైనికులు వ్యవహరించారు. తమ చేతికి చిక్కిన భారత్ వింగ్ కమాండర్ పట్ల పాశవికంగా ప్రవర్తించారు. ఆయనను దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.
Also Read:పాక్ ను తక్కువ అంచనా వేయొద్దు : ప్రతిచర్య చూపించామన్న ఇమ్రాన్ ఖాన్

మిగ్ 21 కూలిపోయినప్పుడు ప్యారాచూట్ ద్వారా అభినందన్ పాక్ భూభాగంలో కిందకు దిగారు. వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్న పాక్ సైనికులు విచక్షణారహితంగా దాడి చేసి హింసించారు.  పైలెట్ అభినందన్ పై పాక్ సైన్యం దాడి దృశ్యాలు సంచలనంగా మారాయి. జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీల మీద చెయ్యి వెయ్యకూడదు, కొట్టకూడదు, హింసించకూడదు. కానీ పాక్ ఆర్మీ అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. భారత వింగ్ కమాండర్ పట్ల క్రూరంగా ప్రవర్తించింది. దీనిపై భారత్ లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: ఏమైనా జరుగవచ్చు : అమెరికాలాగా మేం కూడా చేయగలం

బుధవారం(ఫిబ్రవరి 27) ఉదయం పాక్‌ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చాయి. భారత ఆర్మీ పోస్టులపై దాడికి యత్నించాయి. వాటిని అడ్డుకునేందుకు శ్రీనగర్‌లో ఉన్న క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌లోని మిగ్‌లు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో భారత్‌కు చెందిన మిగ్‌ 21 బైసన్‌ పాక్‌ భూభాగంలోకి ప్రవేశించింది. అక్కడ కూలిపోయింది. ఆ విమానంలో ఉన్న పైలెట్‌ అభినందన్‌ తప్పిపోయారు. కాగా, పైలెట్ అభినందన్ తమకు చిక్కినట్లు పాకిస్తాన్‌ ఒక వీడియో కూడా విడుదల చేసింది.

పైలెట్ మిస్సింగ్‌పై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పైలెట్ మిస్ అయిన మాట వాస్తవమే అని అధికారికంగా ధృవీకరించింది. భారత్‌కు చెందిన మిగ్‌ 21 బైసన్‌ యుద్ధవిమానం పాక్ భూభాగంలో కూలినట్లు భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ చెప్పారు. అందులోని పైలట్‌ ఒకరు గల్లంతయ్యారని వివరించారు. భారత వాయుసేన దాడికి ప్రతిగా భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ ఈ ఉదయం దాడికి పాల్పడిందని రవీష్ చెప్పారు. పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టామన్నారు. పాక్‌కు చెందిన ఎఫ్‌-16 విమానాన్ని కూల్చివేశామని, ఈ క్రమంలో మన మిగ్‌ 21 బైసన్‌ విమానం కూలిపోయిందని, కమాండర్‌ గల్లంతయ్యాడని తెలిపారు.