Lashkar Terrorist : పాక్ ఆర్మీ,ఐఎస్ఐ ట్రైనింగ్ ఇచ్చింది..కీలక విషయాలు బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

జమ్మూకశ్మీర్ లోని ఉరి సెక్టార్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 19 ఏళ్ల పాకిస్తాన్ టెర్రరిస్టు "అలీ బాబర్"ఈ నెల26న భారత ఆర్మీ సజీవంగా పట్టుకోగా.. మరో ఉగ్రవాదిని హతమార్చిన విషయం

Lashkar Terrorist : పాక్ ఆర్మీ,ఐఎస్ఐ ట్రైనింగ్ ఇచ్చింది..కీలక విషయాలు బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

Terrorist

Lashkar Terrorist జమ్మూకశ్మీర్ లోని ఉరి సెక్టార్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 19 ఏళ్ల పాకిస్తాన్ టెర్రరిస్టు “అలీ బాబర్”ని ఈ నెల26న భారత ఆర్మీ సజీవంగా పట్టుకోగా.. మరో ఉగ్రవాదిని హతమార్చిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లల్లో ఓ పాకిస్తాన్ ఉగ్రవాది భారత్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా సజీవంగా పట్టుకోవడం ఇదే మొదటిసారి. అంతకుముందు 2008లో ముంబై ఉగ్రదాడిలో కసబ్‌ను సజీవంగా పట్టుబడ్డాడు. ఆ తర్వాత తాజాగా అలీ బాబర్‌ భారత భూభాగంలో చొరబడుతూ ఆర్మీకి చిక్కాడు.

ALSO READ పరీక్ష రద్దుచేయాలంటు సుప్రీం మెట్లెక్కిన విద్యార్థులు

అయితే ఉరి సెక్టార్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దొరికిపోయిన లష్కర్ ఏ తోయిబా ఉగ్రసంస్థకు చెందిన అలీ బాబర్ బుధవారం అసలు సంగతిని బయట పెట్టాడు. తనను లష్కర్ ఏ తోయిబా రిక్రూట్ చేసుకుందని.. తనకు పాకిస్తాన్ ఆర్మీ,ఐఎస్ఐ(పాక్ గూఢచర్య సంస్థ) ట్రైనింగ్ ఇచ్చినట్లుగా మీడియాతో మాట్లాడుతూ అలీ బాబర్ వెల్లడించాడు. వాళ్లు తనకు మూడు వారాల ట్రైనింగ్,ఆయుధాలు ఇచ్చారని తెలిపాడు. భారత్ లో చొరబడేందుకు తనతోపాటు ఆరుగురు ఉగ్రవాదులను పాక్ ఆర్మీ పంపిందని తెలిపాడు. గ్రూపులోని ఇతర సభ్యులు- 33 ఏళ్ల అతీఖ్-ఉర్-రెహ్మాన్, పాకిస్తాన్ పిండికెప్ నివాసి, తాయెబ్( 34), సముందరి సిటీ నివాసి, 22 ఏళ్ల అబూ బక్కర్ సల్ఫీ, 35 ఏళ్ల అబు ఖతాబ్ .. 27 ఏళ్ల -పాత ఉస్మాన్. అబు, లాహోర్‌లోని ఉస్మాన్ జిల్లా నివాసి అని తెలిపాడు.

ఓ మిషన్ పై తమను భారత్ కు పంపారని,ఆదేశాల కోసం ఎదురుచూడాలి అని తమకు చెప్పి పంపారని అలీ తెలిపాడు. పాక్ ఆర్మీ నుంచే తమకు ఎక్కువగా ఆదేశాలు వస్తుంటాయని అలీ తెలిపాడు. జమ్మూకశ్మీర్ లోకి చొరబడడేందుకు ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీ సహాయం చేస్తుందని..వాళ్ల వ్యక్తిగత లాభం కోసం యువతకు తప్పుడు సమాచారం చెప్పి  బ్రెయిన్ వాష్ చేస్తున్నారని అలీ తెలిపాడు.

ఉగ్రవాదంలోకి ఎలా 

పాకిస్తాన్ లోని ఒకారా జిల్లాలోని దీపాల్పూర్ నివాసి అని చెప్పాడు. తన తండ్రి ముందస్తు మరణం, పేదరికం కారణంగా ఏడవ తరగతిలోనే చదువు ఆపేసి బట్టల షాపులో పనిచేసేవాడినని చెప్పాడు. ఈ క్రమంలో తాను  తప్పుదోవ పట్టించబడ్డానని..  లష్కరే తోయిబాలో చేరడానికి ఆకర్షితుడిని అయినట్లు చెప్పాడు. ఉగ్రవాదంలో చేరడం తప్ప తనకు వేరే మార్గం కనిపించలేదని అలీ చెప్పాడు. రెండేళ్ల క్రితం తాను టెర్రర్ హ్యాండ్లర్‌ను కలిశానని, వారు 2019 లో ఎల్‌ఈటీ క్యాంప్‌కు తీసుకెళ్లానని చెప్పాడు. భారత్ లో ఇస్లాం ప్రమాదంలో ఉందని తమకు చెప్పి తమకు బ్రెయిన్ వాష్ చేశారని అలీ చెప్పాడు. మా అమ్మ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఆర్థికసాయం లష్కరే తోయిబా నుంచి ఆర్థికసాయం అందిందని అలీ చెప్పాడు. ఉగ్రవాద గ్రూపులో చేరినందుకు తనకు మొదట రూ.20వేలు ఇచ్చారని,మరో రూ.30వేలు తర్వాత ఇస్తామని హామీ ఇచ్చారని అలీ చెప్పాడు.

ALSO READ  పురుగు మందుల వాడకం తగ్గితే.. పొగాకు రైతులకు మంచి ధర

2019 లో ముజఫరాబాద్‌లోని గడీవాలాలోని ఖైబర్ క్యాంప్‌లో మూడు వారాల పాటు అలీ శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత 2021లో మరోసారి పూర్తి శిక్షణ తీసుకున్నాడు. అక్కడి నుంచి అతనికి శారీరక, ఆయుధ శిక్షణ ఇవ్వబడింది. అదే సమయంలో శిక్షణ ఇచ్చిన చాలా మంది శిక్షకులు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులు ఉన్నారు.

ఉరీ తరహా దాడికి స్కెచ్

కాగా, భారత్‌లో భారీ విధ్వంసానికి కుట్ర చేస్తోన్న పాక్‌.. దేశంలో చొరబాట్లకు టెర్రరిస్టులను ఎగదోస్తోంది. గత కొన్నివారాలుగా ఉరి,రాంపూర్ సెక్టార్లలో పలు చోట్ల నుంచి ఉగ్రవాదులు దేశంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించగా భార ఆర్మీ వాటిని విఫలం చేసింది. ఉగ్రవాదుల చొరబాటు ఉద్దేశ్యం 2016 ఉరీ తరహాలో మరో దాడిని చేయడం. అయితే ఎప్పటికప్పుడు పాక్‌ కుట్రలను భగ్నం చేస్తోంది ఇండియన్‌ ఆర్మీ. చొరబాటుకు యత్నం చేస్తున్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుండి మద్దతు లభిస్తోందని, ముగ్గురు పోర్టర్‌లు నియంత్రణ రేఖ వరకు ఉగ్రవాదులకు కావాల్సిన సామాగ్రిని తీసుకువచ్చారు ఆర్మీ అధికారి చెప్పారు.ఇక, గత వారం రాంపూర్ సెక్టార్ లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే

ఉరీ సెక్టార్ లో ఆర్మీ ఆపరేషన్ సెప్టెంబర్ 18 న ప్రారంభించబడింది. ఉగ్రవాదుల అనుమానాస్పద కదలికలపై ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో సెప్టెంబరు 18వ తేదీ నుండి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భారత భద్రతా దళాలు ఆరుగురు ఉగ్రవాదులు చొరబాటు యత్నం చేస్తున్నట్లు గుర్తించారు. వారిలో నలుగురు కంచె అవతలి వైపు ఉండగా, ఇద్దరు భూభాగం వైపు వచ్చారు. అటువైపు ఉన్న నలుగురు ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ తప్పించుకోగా, మిగిలిన ఇద్దరు చొరబడ్డారు. 26 వ తేదీ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక చొరబాటుదారుడు మరణించగా,మరొకరిని(అలీ) సజీవంగా పట్టుకున్నారు.