Pak Boy in India: ఎల్వోసీ ధాటి భారత్ లోకి వచ్చిన పాక్ బాలుడు, వెనక్కు పంపించాలంటూ కుటుంబ సభ్యుల వేడుకోలు

పొరపాటుగా నియంత్రణ రేఖను ధాటి భారత్ లోకి ప్రవేశించిన పాకిస్తాన్ బాలుడిని తిరిగి అప్పగించాలంటూ బాలుడి కుటుంబ సభ్యులు భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారు

Pak Boy in India: ఎల్వోసీ ధాటి భారత్ లోకి వచ్చిన పాక్ బాలుడు, వెనక్కు పంపించాలంటూ కుటుంబ సభ్యుల వేడుకోలు

Pak

Pak Boy in India: పొరపాటుగా నియంత్రణ రేఖను ధాటి భారత్ లోకి ప్రవేశించిన పాకిస్తాన్ బాలుడిని తిరిగి అప్పగించాలంటూ బాలుడి కుటుంబ సభ్యులు భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో.. పాకిస్తాన్ సరిహద్దు వద్ద అస్మద్ అలీ అనే పాకిస్తాన్ బాలుడు గతేడాది నవంబర్ లో నియంత్రణ రేఖా ధాటి భారత్ లోకి ప్రవేశించాడు. అదే సమయంలో నియంత్రణ రేఖవద్ద గస్తీ తిరుగుతున్నా భారత గుర్ఖా రెజిమెంట్ 3వ దళం సిబ్బంది.. బాలుడిని అదుపులోకి తీసుకుని, జమ్మూకాశ్మీర్ పోలీసులకు అప్పగించారు. దీంతో గత మూడు నెలలుగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు బాలుడిని రణ్‌బీర్ సింగ్ పోరాలోని జువెనైల్ హోంలో ఉంచారు.

Also read: Gudivada Casino: క్యాసినో వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

పాకిస్తాన్ లోని టాట్రినోతే గ్రామం భారత నియంత్రణ రేఖకు సమీపంలో ఉంటుంది. అదే గ్రామానికి చెందిన అస్మద్ అలీ..స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే బాలుడికి పావురాల అంటే ఎంతో ఇష్టమని.. ఈక్రమంలో తన పెంపుడు పావురాన్ని వెతుక్కుంటూ పొరపాటుగా భారత్ లోకి వచ్చినట్లు బాలుడి మేనమామ అర్బబ్ అలీ తెలిపాడు. అస్మద్ అలీ చిన్నపిల్లవాడని, తమ కుటుంబానికి ఏ రాజకీయ పార్టీలతోనూ, తీవ్రవాద సంస్థలతోనూ ఎటువంటి సంబంధాలు లేవని అర్బబ్ అలీ తెలిపాడు. బాలుడి తల్లి చిన్నతనంలోనే చనిపోగా.. ప్రస్తుతం అమ్మమ్మ తాతయ్యల వద్ద పెరుగుతున్నాడని.. అతను లేకపోవంతో వృద్ధులిద్దరు ఎంతో బాధపడుతున్నట్టు అర్బబ్ అలీ చెప్పాడని “ది ప్రింట్” వెబ్ సైట్ పేర్కొంది.

Also read: US – Russia Fight: ఉక్రెయిన్ లో ఉండే అమెరికన్లు వెనక్కు రావాలని బైడెన్ సూచన

ఇదిలా ఉంటే.. బాలుడిని అదుపులోకి తీసుకోవడంపై భారత భద్రతాధికారులు స్పందిస్తూ.. బాలుడు గతంలోనూ దారి తప్పి వచ్చిన సందర్భాలు ఉన్నాయని, అయితే అప్పట్లో మానవతా దృకదంతొ స్పందించి తిరిగి పంపించివేసినట్లు తెలిపారు. అయితే పదే పదే ఎల్వోసీలోకి వస్తుండడంతో బాలుడిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నట్లు భద్రతాధికారులు వివరించారు. బాలుడు అస్మద్ అలీని జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పోలీసులకు అప్పగించిన సమయంలోను.. నమోదు చేసిన FIRలో ఎటువంటి శిక్షార్హమైన నేరాలు మోపలేదని, పూర్తి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. భారత సైనికుల మనసు ఎంతో గొప్పదని, ఎల్వోసీ వద్ద పహారా కాస్తున్న సమయంలో ముష్కరులపై ఎంత కఠినంగా ఉంటూనే..అటు నుంచి దారి తప్పి వచ్చే చిన్నారులు, మహిళల పట్ల మానవతా హృదయంతో స్పందిస్తారని రిటైర్డ్ సైనికాధికారి ఒకరు వివరించారు. అన్ని విషయాలు పరిశీలించిన మీదట త్వరలోనే బాలుడిని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు.

Also read: Hi-Tech Beggar: చిల్లర లేకుంటే “గూగుల్ పే” చేయండి బాబయ్య: హైటెక్ బిచ్చగాడు