ఉగ్రవాదులపై ఇదే అతిపెద్ద దాడి : ఇండియా

  • Published By: veegamteam ,Published On : February 26, 2019 / 06:24 AM IST
ఉగ్రవాదులపై ఇదే అతిపెద్ద దాడి : ఇండియా

ఢిల్లీ : ఉగ్రవాదాన్ని నిరోధించడంలో పాకిస్తాన్ విఫలమైందని భారత కేంద్ర విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే విమర్శించారు. పాక్ ప్రోత్సాహంతోనే ఉగ్రదాడులు జరిగాయని స్పష్టం చేశారు. జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థపై చర్యలు తీసుకోవాలని భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోన్నా.. పాకిస్థాన్ పెడచెవిన పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దు సమీపంలోని ఉగ్రవాద శిబిరాలపై కచ్చితత్వంతో దాడి చేశామని అధికారికంగా ప్రకటించారాయన. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టామని వెల్లడించారు. ఉగ్రవాదులను నిల్వరించేందుకే దాడులు చేశామని.. ఉగ్రవాదం అంతమయ్యే వరకు ఇలాగే కొనసాగుతాయని కూడా వార్నింగ్ ఇచ్చారాయన.
Also Read :భారత్ సర్జికల్ ఎటాక్స్ : ఒక్కరు కూడా చనిపోలేదన్నపాక్

2019, ఫిబ్రవరి 14న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు CRPF జవాన్లపై ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఉగ్రవాదుల దాడిని అంతర్జాతీయ సమాజం ఖండించిందన్నారు. జైష్ ఏ మహ్మద్ దేశంలో పలుమార్లు దాడులకు పాల్పడిందని తెలిపారు. జైష్ ఏ మహ్మద్ శిక్షణ శిబిరాలపై భారత వైమానిక దళం దాడి చేసిందని.. ఈ దాడుల్లో ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలోనే వివరిస్తామని వివరించారు విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే.
Also Read : బోర్డర్ లో హై ఎలర్ట్ : ప్రధాని మోడీ ఎమర్జన్సీ మీటింగ్
Also Read : జవాన్లకు రక్షణ కల్పించండి : సుప్రీంలో సైనికుల కూతుర్ల పిటిషన్