సుందర్‌బానీ సెక్టార్‌లో పాక్ కాల్పులు: భారత్ జవాన్ మృతి 

  • Published By: veegamteam ,Published On : March 18, 2019 / 07:17 AM IST
సుందర్‌బానీ సెక్టార్‌లో పాక్ కాల్పులు: భారత్ జవాన్ మృతి 

శ్రీనగర్‌ : సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరోసారి  పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ క్రమంలో మార్చి 18 తేదీ ఉదయం 5:30 గంటల సమయంలో పాక్‌ రేంజర్లు కాల్పులు జరిపారు. రాజౌరీ జిల్లాలోని సుందర్‌బానీ సెక్టార్‌లో భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్‌ రేంజర్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భారత్ జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. పాక్‌ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. కాగా..మార్చి 17న కూడా పాక్ రాజౌరీలో కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
Read Also : ఆఫ్రికా దేశాల్లో ‘ఇడాయ్’ తుఫాన్…140 మంది మృతి

జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో భారత్ జవాన్లపై పాకిస్థాన్ ఉగ్రదాడి ఘటనలో 40మంది జవాన్లు మృతి చెందారు. ఈ దాడి అనంతరం భారత్ పాక్ ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులతో విరుచుకుపడిన ఘటనలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ క్రమంలో రగిలిపోయిన పాక్ భారత్ పై దాడికి యత్నించింది. దీన్ని భారత వైమానిక దళం సమర్థవంతంగా తిప్పికొట్టింది.

ఈ క్రమంలో భారత వైమానికా దళం కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ కు దొరికిపోవటం వంటి పలు కీలక పరిణామాల మధ్య..అంతర్జాతీయంగా పాక్ పై వచ్చిన ఒత్తిడితో సురక్షితంగా భారత్ కు అభినందన్ ను అప్పగించింది. ఆనాటి నుంచి రగిలిపోతున్న పాక్ తరచు కాల్పులకు పాల్పడుతునే ఉంది. పాక్ దాడులను భారత్ ధీటుగా తిప్పికొడుతునే ఉంది.