అక్కడా అంతే : పాక్ ఎయిర్ పోర్టులు మూసివేత, దారి మళ్లింపు

  • Published By: madhu ,Published On : February 27, 2019 / 07:20 AM IST
అక్కడా అంతే : పాక్ ఎయిర్ పోర్టులు మూసివేత, దారి మళ్లింపు

భారత్ – పాక్ సరిహద్దు దగ్గర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాలు అలర్ట్ అయ్యాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఆదేశాలు తరువాయి అన్నట్లు భారత సైన్యం శత్రుదేశంపై విరుచకపడేందుకు అలర్ట్‌గా ఉంది. పాక్ ఎలాంటి వైఖరి కనబరుస్తుందో ప్రతి క్షణం క్షణ్ణంగా పరిశీలిస్తూ భారత్ కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే భారత్ లోని నాలుగు ఎయిర్ పోర్టులను భారత్ మూసివేసింది. వెంటనే పాక్ కూడా అదే బాటలో పయనించింది. 
Also Read: అణ్వాయుధాల టీమ్ తో ఇమ్రాన్ ఎమర్జన్సీ మీటింగ్

పాక్ లోని ఐదు ఎయిర్ పోర్టులు మూసివేశారు. ముల్తాన్, ఇస్లామాబాద్, లాహోర్, సియాల్ కోట్, ఫైసలాబాద్ ఎయిర్ పోర్టుల్లో సర్వీసులు నిలిపివేశాయి. అంతర్జాతీయ సర్వీసులను దారి మళ్లించాయి. జాతీయ, అంతర్జాతీయ పౌర విమాన సేవలను కూడా పాక్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రయాణికులను విమానాశ్రయాల నుంచి బయటకు పంపించి వేస్తోంది. ఎలాంటి టికెట్ బుకింగ్స్ చేపట్టవద్దని విమాన సంస్థలను ఆదేశించింది పాక్ ప్రభుత్వం. అలాగే పీవోకేలోని అన్ని యూనివర్సిటీలను మూసివేసింది. భారత్ – పాక్ మధ్య నడిచే అంతర్జాతీయ సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. పాక్ దేశం నుంచి విదేశాలకు వెళ్లే అన్ని భారత అంతర్జాతీయ విమానాలను కూడా దారి మళ్లిస్తున్నారు. భారత భూభాగం నుంచి వెళ్లే పాక్ అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా దారి మళ్లించటం విశేషం..

Also Read: మానవబాంబుల తయారీ కేంద్రంగా బాలకోట్

ఫిబ్రవరి 26వ తేదీ మంగళవారం రాత్రంతా 15 సరిహద్దు ప్రాంతాలలో పాక్ రేంజర్లు కాల్పులకు దిగాయి. పాక్ రేంజర్ల కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. ఇందులో ఐదుగురు జవాన్లకు‌ గాయాలయ్యాయి. ఇద్దరిని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. పౌరుల నివాసాలను పాక్ రేంజర్లు టార్గెట్ చేశాయి. 
Also Read: Surgical Strikes 2.0 : హైదరాబాద్ అప్రమత్తం