Pakistan Man Crossed Border : భారత్ లో ప్రేయసి కోసం..బోర్డర్ దాటిన పాక్ యువకుడు అరెస్ట్

పాకిస్తాన్ లోని భారత సరిహద్దు జిల్లా బహవల్‌పూర్‌ లోని హసిల్ పూర్ కు చెందిన మహ్మద్ అమీర్‌(22)అనే యువకుడు సరిహద్దు కంచె దాటి భారత్ లోకి ప్రవేశించాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన

Pakistan Man Crossed Border : భారత్ లో ప్రేయసి కోసం..బోర్డర్ దాటిన పాక్ యువకుడు అరెస్ట్

Border

Pakistan Man Crossed Border :  పాకిస్తాన్ లోని భారత సరిహద్దు జిల్లా బహవల్‌పూర్‌ లోని హసిల్ పూర్ కు చెందిన మహ్మద్ అమీర్‌(22)అనే యువకుడు సరిహద్దు కంచె దాటి భారత్ లోకి ప్రవేశించాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF‌) పెట్రోలింగ్ బృందం అతడిని అరెస్ట్‌ చేసింది. శనివారం అర్థరాత్రి రాజస్తాన్‌లోని శ్రీ గంగానగర్‌ లో సరిహద్దు వద్ద ఈ ఘటన జరిగింది.

అయితే సరిహద్దు ఎందుకు దాటి వచ్చావని బీఎస్ఎఫ్ జవాన్లు మహ్మద్ అమీర్ ను ప్రశ్నించగా.. తనకు ముంబైకి చెందిన మహిళతో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడిందని,తాము ప్రేమించుకుంటున్నామని,ఆమెను కలిసేందుకు వెళ్లాలని నిర్ణయించుకుని బోర్డర్ దాటినట్లు సమాధానమిచ్చాడు. భారత్‌ వచ్చేందుకు తాను ఇంతకుముందే వీసా కోసం దరఖాస్తు చేయగా తిరస్కరించారని, అందుకే సరిహద్దు దాటి వచ్చినట్లు మహ్మద్ అమీర్ చెప్పాడు.

అయితే అనుప్‌గఢ్‌లో సరిహద్దు భద్రతా దళానికి చెందిన పెట్రోలింగ్ బృందం శనివారం రాత్రి ఆ యువకుడిని పట్టుకున్నప్పుడు అతడి వద్ద మొబైల్ ఫోన్ మరియు కొన్ని కరెన్సీ నోట్లు మాత్రమే ఉన్నాయని శ్రీ గంగానగర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆనంద్ శర్మ తెలిపారు. అమీర్ చెప్పిన వివరాలు ఇంకా అనుమానాస్పదంగా ఉన్నాయని, అతడు చెప్పిన మాటలను భద్రతా సంస్థలు ఇంకా ధృవీకరించలేదని శర్మ చెప్పారు. రాజస్తాన్‌ సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలోని పాకిస్తాన్‌ ఊరి నుంచి అమీర్‌ సరిహద్దు కంచెను దాటి భారత్‌లోకి ఎలా ప్రవేశించాడు అన్నదానిపై ఇంటెలిజెన్స్ అధికారుల ఉమ్మడి బృందం మంగళవారం అతన్ని విచారించడం ప్రారంభిస్తుందని, అతను చేప్పిన ప్రతి మాటను క్రాస్ చెక్ చేస్తుందని శర్మ తెలిపారు.

ALSO READ OPS-EPS : అన్నాడీఎంకే చీఫ్ లుగా ఎన్నికైన ఓపీఎస్-ఈపీఎస్..చిన్నమ్మకు కష్టాలే!