పుల్వామా ఎఫెక్ట్: వరల్డ్ కప్ నుంచి పాక్ షూటర్లు ఔట్

పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు వరుస షాక్ లు ఇస్తోంది. పాక్ తో అన్ని రకాల రిలేషన్స్ ను

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 06:22 AM IST
పుల్వామా ఎఫెక్ట్: వరల్డ్ కప్ నుంచి పాక్ షూటర్లు ఔట్

పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు వరుస షాక్ లు ఇస్తోంది. పాక్ తో అన్ని రకాల రిలేషన్స్ ను

పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు వరుస షాక్ లు ఇస్తోంది. పాక్ తో అన్ని రకాల రిలేషన్స్ ను కట్ చేస్తోంది. పాక్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టింది. దౌత్యపరంగా ఏకాకిని చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ నటులను వెనక్కి పంపేసింది. క్రికెట్ మ్యాచ్ లు ఆడేది లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ షూటర్లకు భారత ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగే అంతర్జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో పాకిస్తాన్ షూటర్లు పాల్గొనకుండా చేసింది. పాక్ షూటర్లకు వీసాలు ఇచ్చేందుకు భారత హై కమిషన్ నిరాకరించింది.

 

International Shooting Sport Federation(ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 21వ తేదీ గురువారం నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. బుధవారం(ఫిబ్రవరి 20వ తేదీ) పాక్ షూటర్లు భారత్ కు రావాల్సి ఉంది. కానీ వారికి వీసాలు ఇచ్చేందుకు భారత్ హై కమిషన్ తిరస్కరించింది. పాక్ నుంచి షూటర్లు బషీర్, ఖలీల్ అహ్మద్ వీసాలకు అప్లయ్ చేసుకున్నారు. టోర్నీలో పాల్గొనేందుకు చాలా ఆసక్తిగా ఉన్న వారు.. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో వారికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 2020 టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించాలంటే ఈ టోర్నోలో పాల్గొనడం చాలా ముఖ్యం.

 

ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 40మంది జవాన్లు అమరులయ్యారు. దాడి చేసింది తామే అని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రకటించింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం.. ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని పచ్చి అబద్దాలు చెప్పారు. ఆధారాలు ఉంటే ఇవ్వండి, చర్యలు తీసుకుంటామని కబుర్లు చెప్పారు.