కచ్‌లో హై అలర్ట్ : జల మార్గం గుండా భారత్‌లోకి పాక్ కమాండోలు

కచ్‌లో హై అలర్ట్ : జల మార్గం గుండా భారత్‌లోకి పాక్ కమాండోలు

పాకిస్తాన్ ట్రైయిన్డ్ కమాండోలు భారత భూభాగంలోకి చొరబడినట్లు సమాచారం. సముద్ర మార్గం ద్వారా వచ్చిన పాక్ బలగాలు కచ్‌ ప్రాంతానికి, కాండ్లా పోర్ట్‌కు చేరుకున్నారని సమాచారం. దీంతో ఆ ప్రాంతమంతా అలర్ట్‌గా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. గుజరాత్‌లో ఉన్న ఆరు మేజర్ పోర్టులలో రెండింటిలోకి చొరబడ్డారని సమాచారం అందడంతో భారత బలగాలు అప్రమత్తమవుతున్నాయి. 

దీనదయాళ్ పోర్ట్‌గా పేరున్న కాండ్లా పోర్ట్ ఇలా తెలిపింది. ‘ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. పాకిస్తాన్ ట్రైయిన్డ్ కమాండోలు కుచ్ ప్రాంతానికి, హరామీ నాలా క్రీక్ ద్వారా సమీపించారు. వారు నీటిలో జరిగే దాడిని కూడా అడ్డుకునే విధంగా శిక్షణ పొందినట్లు సమాచారం. గుజరాత్‌లో ఇప్పటికే అలర్ట్ ప్రకటించాం’ అని కాండ్లా పోర్టు వెల్లడించింది. 

సముద్రంలోకి వెళ్తున్న షిప్‌లు శత్రు మూకల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంతాల సమీపంలో షిప్‌లు ఆగి ఉంటే వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. అనుమానస్పద కదలికలు ఉంటే దగ్గరలోని తీర ప్రాంతాలకు తెలియజేయాలి. 

కోస్ట్ గార్డ్ తీర ప్రాంతం నుంచి 12నాటికల్ మైల్స్ వరకూ ఏం జరిగినా వారే బాధ్యత వహించాలి. అంతకంటే ముందు భారత నేవీ అధికారులు తీర ప్రాంతాలకు హై అలర్ట్ ప్రకటించారు. అనుమానస్పద కదలికలు తెలియజేయాలని ముందుగానే సూచించారు.