భారత భూభాగంలోకి పాక్ డ్రోన్…పేల్చేసిన ఆర్మీ

  • Published By: vamsi ,Published On : February 26, 2019 / 11:10 AM IST
భారత భూభాగంలోకి పాక్ డ్రోన్…పేల్చేసిన ఆర్మీ

పాక్ లోని బాల్కోట్ లోని జైషే ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన కొన్ని గంటల్లోనే పాక్ కు చెందిన ఓ స్పై(గూఢచర్య) భారత భూభగంలోకి చొచ్చుకొచ్చింది. గుజరాత్ లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దు నలియా ఎయిర్ బేస్ కి అతి సమీపంలోని అబ్దాసా గ్రామాంలో పాక్ కు చెందిన డ్రోన్ ని గుర్తించిన భారత ఆర్మీ,పోలీసు అధికారులు దాన్ని అక్కడే పేల్చి పడేశారు.
Also Read : దేశవ్యాప్తంగా హైఅలర్ట్: ఉగ్రదాడులు జరగొచ్చని ఐబీ వార్నింగ్

ఇజ్రాయెల్ ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్ స్పైడర్ కు చెందిన డర్బై మిసైల్ తో  డ్రోన్ ని పేల్చివేశారు. మొట్టమొదటిసారిగా శత్రువు ఎయిర్ క్రాఫ్ట్ టార్గెట్ చేయడానికి భారత్ దీన్ని ఉపయోగించింది. సరిహద్దు రాష్ట్రాల్లో ఇప్పటికే భారత ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. భారత్ లో పలు చోట్ల దాడులు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది.

Also Read :అప్పటి విమానం హైజాక్ తీవ్రవాది.. ఈ దాడుల్లో చచ్చాడు
Also Read : అర్థరాత్రి యుద్ధం : పాక్ విమానాలు వెంటాడినా.. భారత్ పైటర్లు చిక్కలేదా!