సెప్టెంబర్ 30 డెడ్ లైన్ : ఆధార్ లింక్ చేయలేదా? మీ PAN Card చెల్లదు!

  • Published By: sreehari ,Published On : September 28, 2019 / 12:02 PM IST
సెప్టెంబర్ 30 డెడ్ లైన్ : ఆధార్ లింక్ చేయలేదా? మీ PAN Card చెల్లదు!

పాన్ కార్డు యూజర్లకు అలర్ట్. ఆధార్ కార్డుతో ఇంకా పాన్ కార్డు లింక్ చేయలేదా? అయితే వెంటనే లింక్ చేసుకోండి. లేదంటే మీ పాన్ కార్డు పనిచేయదు. యూనిక్ ఐడెంటిటీ ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం చేయడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. PAN-Aadhaar అనుసంధానం చేసుకోలేని వారి కోసం ప్రభుత్వం గడవు తేదీని పొడిగిస్తూ వస్తోంది. గతంలో ఎన్నోసార్లు గడువు తేదీని పొడిగించింది. ఈసారి.. సెప్టెంబర్ 30వ తేదీ వరకు డెడ్ లైన్ విధించింది.

ఆ తర్వాత పాన్ కార్డు నిరూపయోగంగా మిగిలిపోతుంది. 10 అంకెల గల (అల్ఫా న్యూమరిక్) పాన్ కార్డును ఆదాయ టాక్సు (I-T) డిపార్ట్ మెంట్ జారీ చేస్తుంది. అలాగే 12 అంకెల గల ఆధార్ కార్డును UIDAI జారీ చేస్తుంది. ఇప్పటివరకూ పాన్ కార్డును తమ ఆధార్ కార్డు లింక్ చేసుకోని వారు త్వరగా అనుసంధానం చేసుకోండి.

I-T వెబ్ సైట్ లేదా SMS ద్వారా ఈజీగా ఆధార్ -పాన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ రికార్డుల ప్రకారం.. ఇప్పటివరకూ 8.47 కోట్ల వ్యక్తిగత పాన్ కార్డు దారుల్లో 6.77 కోట్ల మంది యూజర్లు తమ పాన్ కార్డులను ఆధార్ నెంబర్ తో లింక్ చేసుకున్నారు. 

* ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకునే యూజర్లు రెండెంటిపై తమ వివరాలు సరిపోలేలా చూసుకోండి. 
* పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మిస్ మ్యాచ్ కాకుండా చెక్ చేసుకోండి.
* సరైన వివరాలను ఎంటర్ చేయండి. రెండు కార్టులో వివరాలు తప్పనిసరిగా మ్యాచ్ కావాలి. 
* ఏ కార్డులో వివరాలు మ్యాచ్ కాకపోయినా ఆధార్-పాన్ కార్డు లింక్ చేసుకోవడం కుదరదు.
* ఆధార్ కార్డులో పేరు తప్పుగా ఉంటే UIDAI వెబ్ సైట్లో ఫిక్స్ చేసుకోండి. 
* పాన్ కార్డులో సమస్యల కోసం UTI-ITSL ద్వారా చెక్ చేసుకోవచ్చు.
* మీ ఆధార్ తో పాన్ లింక్ చేయకపోతే ఆర్థిక లావాదేవీలు చేసుకోలేరు.
* గడువు తేదీ దాటితే మీ పాన్ కార్డు చెల్లదు.