ఆధార్‌ ను లింకు చేయకపోతే పాన్‌ కార్డు పనిచేయదు

ఆధార్‌ కార్డు నెంబర్‌ను పాన్‌ కార్డుతో మార్చి 31లోగా అనుసంధానించకపోతే ఆ పాన్‌ కార్డు పనిచేయదని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ తెలిపింది.

  • Published By: veegamteam ,Published On : February 15, 2020 / 02:10 AM IST
ఆధార్‌ ను లింకు చేయకపోతే పాన్‌ కార్డు పనిచేయదు

ఆధార్‌ కార్డు నెంబర్‌ను పాన్‌ కార్డుతో మార్చి 31లోగా అనుసంధానించకపోతే ఆ పాన్‌ కార్డు పనిచేయదని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ తెలిపింది.

ఆధార్‌ కార్డు నెంబర్‌ను పాన్‌ కార్డుతో మార్చి 31లోగా అనుసంధానించకపోతే ఆ పాన్‌ కార్డు పనిచేయదని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ తెలిపింది. ఇప్పటి వరకు పాన్‌ కార్డు- ఆధార్‌ అనుసంధాన గడువును పలు దఫాలుగా పొడిగిస్తూ వచ్చిన ఐటీ శాఖ.. తాజాగా మార్చి 31 వరకు పొడిగించింది. 

2020, జనవరి 27వ తేదీ వరకు పాన్‌ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయని వారు 30.75 కోట్ల మందికి పైగా ఉంటారు. మరో 17.58 కోట్ల మంది ఆధార్‌, పాన్‌ కార్డును అనుసంధానించలేదని ఐటీ శాఖ తెలిపింది. మార్చి 31 లోపు ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానం చేసిన పాన్‌ కార్డులు మాత్రమే పని చేస్తాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం (ఫిబ్రవరి 14, 2020) ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.   

Read Here>>వైద్యం చేస్తున్న 1700 డాక్టర్లకీ కరోనావైరస్.. చైనాకొచ్చిన కొత్త కష్టం!