Bengaluru : మరో భవంతి వంగిపోయింది..కూల్చివేయాలని నిర్ణయం

బెంగళూరులో ఇటీవ భవంతులు కూలిపోవడం సర్వసాధారణంగా మారిపోయాయి. నాలుగు అంతస్తుల భవనం 2021, అక్టోబర్ 12వ తేదీ అర్ధరాత్రి పక్కకు ఒరిగిపోయింది.

Bengaluru : మరో భవంతి వంగిపోయింది..కూల్చివేయాలని నిర్ణయం

Bengaluru

Four Storey Building In Bengaluru : బెంగళూరులో ఇటీవ భవంతులు కూలిపోవడం సర్వసాధారణంగా మారిపోయాయి. గత కొన్ని రోజులుగా అపార్ట్ మెంట్ లు పక్కకు ఒరిగి..కూలిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా..కర్నాటకలోని బెంగళూరులో నాలుగు అంతస్తుల భవనం 2021, అక్టోబర్ 12వ తేదీ అర్ధరాత్రి పక్కకు ఒరిగిపోయింది. దీంతో అందులో ఉన్న నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ భవనం పశ్చిమ బెంగళూరు కమలానగర్ లో ఉంది.

Read More : London : వ్యాన్‌ను జుట్టుతో లాగేసింది..నెటిజన్ల ట్రోలింగ్..ఏ షాంపు వాడుతున్నావు తల్లీ

అపార్ట్ మెంట్ లో ఉంటున్న వారు…బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు అపార్ట్ మెంట్ లో ఉన్న వారిని ఖాళీ చేయించారు. వీరందరినీ ఇతర ప్రాంతాలకు తరలించారు. వీరికి వసతి, భోజన ఏర్పాట్లు చేశామని నగర పౌరసంస్థ అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక శాఖ, అత్యవసర సేవ అధికారులు కూడా అక్కడే ఉన్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు.ఎడతెగని వర్షం, పునాదులు సరిగ్గా లేకపోవడం వల్లే భవంతి పక్కకు ఒరిగిపోయిందని అధికారులు భావిస్తున్నారు. దీనిని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.

Read More : Massive Power Cut: దేశంలో కరెంట్ కోతలు మొదలయ్యాయ్.. గంటల కొద్దీ నో పవర్

ఆదివారం, సోమవారాల్లో బెంగళూరులో భారీ వర్షం కురవడంతో వరద పోటెత్తింది.  గత వారం బెంగళూరులోని కస్తూరినగర్ లో ఐదంతస్తుల అపార్ట్ మెంట్ కూలిపోయింది. ఇది నెల రోజుల్లో నాలుగో ఘటన. గత బుధవారం భారీ వర్షం కారణంగా..బెలగావోని బాదల్ – అంకల్గి గ్రామంలో ఓ నివాసం కూలిపోవడంతో ఏడుగురు చనిపోయారు. సెప్టెంబర్ 27వ తేదీన బెంగళూరులోని లక్కసంద్ర ప్రాంతంలో 70 సంవత్సరాలున్న భవనం కూలిపోయింది. అయితే..ప్రాణనష్టం సంభవించలేదు.