కారణం ఏంటో : ఎన్నికలకు పరేష్ రావెల్ దూరం

  • Published By: madhu ,Published On : March 23, 2019 / 10:58 AM IST
కారణం ఏంటో : ఎన్నికలకు పరేష్ రావెల్ దూరం

బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరొంది..ఎంతో అభిమానులను సంపాదించుకున్న నటుడు ‘పరేష్ రావల్’ ఈసారి ఎన్నికల బరిలో నిలవడం లేదు. సినీ నటుడిగా ఎదిగిన ఈయన పార్లమెంట్ మెట్లు ఎక్కారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారని తెగ ప్రచారం జరిగింది. తిరిగి ఆయన ఎలక్షన్‌లో బీజేపీ తరపున పోటీ చేస్తారని ఊహించిన వారికి ‘పరేష్ రావల్’ షాక్ ఇచ్చారు. 

2019 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ తూర్పు లోక్ సభ నియోజకవర్గం నుండి పరేష్ రావల్ గత ఎన్నికల్లో గెలుపొందారు. ఈసారి మాత్రం బీజేపీ ఆయన్ను పక్కకు పెట్టారని ఊహాగానాలు వెలువడ్డాయి. దీనిపై ’పరేష్ రావల్’ మార్చి 23వ తేదీ శనివారం స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. 

తన నామినేషన్ విషయంలో ఏదో ఏదో ఊహించుకోవద్దని..మీడియా..స్నేహితులను కోరుతున్నట్లు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయవద్దని అనుకున్నట్లు..ఈ విషయాన్ని తాను కొన్ని నెలల క్రితమే BJP అధిష్టానానికి వెల్లడించినట్లు చెప్పారు. పోటీ చేయకపోయినా..తాను మాత్రం బీజేపీకి విశ్వాసపాత్రుడిగా ఉంటానని పేర్కొన్న రావెల్ పీఎం మోడీకి మాత్రం మద్దతు దారుడిగా ఉంటానని పరేశ్ రావల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

2014 ఎన్నికల్లో అహ్మదాబాద్ తూర్పు లోక్ సభ నియోజకవర్గం నుండి పరేష్ గెలుపొందారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి హిమ్మత్ సిన్హ్ పటేల్‌పై విజయం సాధించారు పరేష్ రావెల్. తాజాగా పరేష్ రావల్ తప్పుకోవడంతో ఈయన స్థానంలో కొత్త వ్యక్తి కోసం బీజేపీ చూస్తోందంట.