Delhi Park : కరోనా తీవ్రతకు నిలువెత్తు నిదర్శనం.. పచ్చని పార్కుని ఏకంగా శ్మశాన వాటికగా మార్చేశారు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. చెట్లతో పచ్చగా కళకళలాడుతున్న ఓ పబ్లిక్ పార్కుని ఏకంగా శ్మశాన వాటికగా మార్చేశారు అధికారులు. ఆ పార్కులో మృతదేహాల ఖననంతో పాటు దహనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఢిల్లీలో కరోనాతో చనిపోయే వారి సంఖ్య భారీగా పెరగడంతో మృతదేహాలను ఖననం చేసేందుకు అక్కడున్న

Delhi Park : కరోనా తీవ్రతకు నిలువెత్తు నిదర్శనం.. పచ్చని పార్కుని ఏకంగా శ్మశాన వాటికగా మార్చేశారు

Delhi Park

Park turned into cremation ground in Delhi : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. చెట్లతో పచ్చగా కళకళలాడుతున్న ఓ పబ్లిక్ పార్కుని ఏకంగా శ్మశాన వాటికగా మార్చేశారు అధికారులు. ఆ పార్కులో శవాల ఖననంతో పాటు దహనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఢిల్లీలో కరోనాతో చనిపోయే వారి సంఖ్య భారీగా పెరగడంతో మృతదేహాలను ఖననం చేసేందుకు అక్కడున్న శ్మశాన వాటికలు సరిపోవడం లేదు. శ్మశాన వాటికలన్నీ శవాలతో ఫుల్ అయ్యాయి. శ్మశాన వాటికల బయట ఇంకా మృతదేహాలు బారులు తీరాయి. అంతిమ సంస్కారాలకు గంటల కొద్దీ సమయం పడుతోంది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పబ్లిక్ పార్కులను, ఖాళీ ప్రదేశాలను అంతిమ సంస్కారాలకు వినియోగిస్తున్నారు. తాజాగా ఓ పబ్లిక్ పార్కుని శ్మశాన వాటికగా మార్చేశారు.

రోజూ పదుల సంఖ్యలో వస్తున్న డెడ్ బాడీలు:
ఈ పార్కులో 20 ప్లాట్ పామ్స్, రెండు ఈ-ఫర్నేస్ లు ఏర్పాటు చేశారు. శనివారం(ఏప్రిల్ 24,2021) ఒక్కరోజే 27 మృతదేహాలు వచ్చాయి. ఆదివారం(ఏప్రిల్ 25,2021) మరో 30 డెడ్ బాడీస్ వచ్చాయి. ”కరోనాతో చనిపోయే వారి సంఖ్య పెరగడంతో శ్మశానాల్లో మృతదేహాలను ఖననం చేసేందుకు స్థలం సరిపోవడం లేదు. పార్కులో ఏర్పాటు చేసిన 20 ప్లాట్ ఫామ్స్ తో మృతదేహాలను ఖననం చేస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి వరకు శ్మశాన వాటికను తెరిచి ఉంచుతున్నాం” అని శ్మశాన వాటిక సిబ్బంది తెలిపారు.

పార్కులో ప్లాట్ ఫామ్స్ నిర్మాణ పనులు ఓ కాంట్రాక్టర్ కి అప్పగించారు. త్వరలోనే పార్కులోని మిగతా స్థలాన్ని ఉపయోగించుకుంటామని, 50 ప్లాట్ పామ్స్ నిర్మిస్తామని కాంట్రాక్టర్ చెప్పారు.

ఖాళీ స్థలాలు, పచ్చని పార్కుల్లో శవాల దహనం:
కొన్ని రోజులుగా గుట్టలు గుట్టలుగా మృతదేహాలు శ్మశాన వాటికలకు వస్తున్నాయి. దీంతో చాలామంది శ్మశాన వాటికల బయట గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కాగా, కోవిడ్ తో చనిపోయి వారి మృతదేహాలను దహనం చేసేందుకు ప్రత్యేక ప్లాట్ పామ్స్ నిర్మించారు. సాధారణంగా ఖాళీ స్థలాల్లో స్మశాన వాటికలు నిర్మిస్తారు. కానీ పచ్చని చెట్లతో అలరారుతున్న పార్కుని శ్మశాన వాటికలా మార్చేశారు. దీని వల్ల పచ్చదనం దెబ్బతింటుందని స్థానికులు వాపోయారు. అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో మరో దారి లేదన్నారు.

ప్రతి గంటకు 12 కరోనా మరణాలు:
కరోనావైరస్ మహమ్మారి ఢిల్లీని వణికిస్తోంది. ప్రస్తుతం అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 94వేల 592గా ఉంది. ఇన్ ఫెక్షన్ రేటు 30.21శాతంగా ఉంది. లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటికి కరోనా కొత్త కేసులు, మరణాలు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఆక్సిజన్ కొరత ఢిల్లీలో కరోనా రోగులకు శాపంగా మారింది. గత సోమవారం కరోనా కారణంగా గంటకు ఐదుగురు చనిపోతే ఆ సంఖ్య ప్రస్తుతం 12కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 21వేల 071 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా కారణంగా గంటకు సగటున 12మంది చనిపోతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 24 వరకు 1,777 మంది కరోనాతో చనిపోయారు.

ఒక్కరోజే 350 మరణాలు:
గతేడాదితో(2020) పోలిస్తే ఈసారి కరోనా వ్యాప్తి మరింత తీవ్రంగా ఉందని ఎయిమ్స్ డాక్టర్లు తేల్చారు. గతేడాది కరోనా సోకిన ఒక వ్యక్తి నుంచి నలుగురికి కోవిడ్ సోకే పరిస్థితి ఉంటే, ప్రస్తుతం కరోనా సోకిన ఒక వ్యక్తి నుంచి 9మందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు. ఇక ఢిల్లీలో ఏప్ర్రిల్ 19న 240 కరోనా మరణాలు నమోదైతే, ఏప్రిల్ 20న 277 మరణాలు నమోదయ్యాయి. నిన్న(ఏప్రిల్ 25,2021) ఒక్కరోజే 350మంది కరోనాతో చనిపోయారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ ను మే 3వరకు పొడిగిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కోవిడ్ కారణంగా చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానాల్లో చోటు చాలకపోవడంతో పచ్చని పార్కులను, ఖాళీ ప్రదేశాలను అంతిమ సంస్కారాలకు వినియోగించాల్సిన దుస్థితి ఏర్పడింది.

దేశంలో కరోనా మరణ మృదంగం:
దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. భారీగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి పెద్దఎత్తున ప్రాణాలు బలి తీసుకుంటోంది. తాజాగా ఒక్కరోజే 2వేల 812 మందిని కరోనా కాటేయడం ఆందోళనకు గురి చేస్తోంది. ఆదివారం(ఏప్రిల్ 25,2021) 14,02,367 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3లక్షల 52వేల 991 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కి చేరగా.. ఇప్పటివరకు 1,92,123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు సోమవారం(ఏప్రిల్ 26,2021) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది.

మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 15.82 శాతానికి పెరిగింది. కొవిడ్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 28లక్షల 13వేల 658కి చేరింది. ఈ లెక్కలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు, నిన్న ఒక్కరోజే 2లక్షల 19వేల 272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా కోటీ 43లక్షల మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 83.05 శాతానికి పడిపోయింది. ఇదిలా ఉండగా.. నిన్న 9,95,288 మంది కరోనా టీకా వేయించుకున్నారు. మొత్తంగా టీకాలు తీసుకున్నవారి సంఖ్య 14కోట్ల 19లక్షల 11వేల 223కి చేరింది.

మహారాష్ట్రలో మృత్యుఘోష:
దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం మరణాల్లో మహారాష్ట్ర వాటానే అధికంగా ఉంది. తాజాగా అక్కడ 832 మంది మరణించగా..66వేల పైచిలుకు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఏడు లక్షలమందికి పైగా కరోనాతో బాధపడుతున్నారు. ఢిల్లీలో 22,933 కొత్త కేసులు వెలుగుచూడగా..350 మంది ప్రాణాలు వదిలారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 35వేలు, కర్ణాటకలో 34వేల మందికి కరోనా సోకింది. కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్, రాజస్థాన్‌లోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.