Parliament Budget Session2023: రేపటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. కీలక బిల్లులకు ఆమోదం

ప్రస్తుతం పార్లమెంట్ ఉభయసభల్లో పెండింగ్‌లో 35 బిల్లులు ఉన్నాయి. వీటిల్లో రాజ్యసభ‌లో 26 బిల్లులు, లోక్‌సభలో తొమ్మిది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కీలక బిల్లులు ఆమోదంకోసం సమావేశాల ముందుకు రానున్నాయి.

Parliament Budget Session2023: రేపటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. కీలక బిల్లులకు ఆమోదం

Parliament

Parliament Budget Session2023: రేపటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ఆమోదం, గ్రాంట్లపై చర్చ జరగనుంది. అదేవిధంగా కీలక బిల్లులు ఆమోదానికి సమావేశాల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఉభయసభల్లో పెండింగ్‌లో 35 బిల్లులు ఉన్నాయి. వీటిల్లో రాజ్యసభ‌లో 26 బిల్లులు, లోక్‌సభలో తొమ్మిది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కీలక బిల్లులు ఆమోదంకోసం సమావేశాల ముందుకు రానున్నాయి.

Parliament Budget Sessions : జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి1న కేంద్ర బడ్జెట్

పార్లమెంట్ ముందుకు రానున్న కీలక బిల్లులు .. 

జీవవైవిధ్య (సవరణ) బిల్లు – 2021, వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు , అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల (సవరణ) బిల్లు- 2019, షెడ్యూల్డ్ తెగలు మూడవ రాజ్యాంగ సవరణ బిల్లు2022, షెడ్యూల్డ్ తెగలు ఐదవ రాజ్యాంగ సవరణ బిల్లు- 2022, తమిళనాడు లెజిస్లేటివ్ కౌన్సిల్ (రద్దు) బిల్లు, పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణం (మూడవ) బిల్లు – 2013, ఢిల్లీ అద్దె (రద్దు) బిల్లు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ రాజ్యాంగం సవరణ బిల్లు 2019, ది ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లు (ఖాళీల తప్పనిసరి నోటిఫికేషన్) సవరణ బిల్లు.

Budget Session 2023: ప్రపంచం మొత్తం భారతదేశ బడ్జెట్‌‌ను చూస్తోంది.. ప్రధాని మోదీ

అదేవిధంగా ది ఇండియన్ మెడిక్‌లైన్ 2013 హోమియోపతి ఫార్మసీ బిల్లు, ది మైన్స్ సవరణ బిల్లు, రాజస్థాన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బిల్లు 2013, ది సీడ్స్ బిల్లు, ది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (సవరణ) బిల్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ (అనధికార ఆక్రమణదారుల తొలగింపు) బిల్లు 2014, మధ్యవర్తిత్వ బిల్లు 2021, ది సినిమాటోగ్రాఫ్ సవరణ బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, DNA టెక్నాలజీ (యూజ్ అండ్ అప్లికేషన్) రెగ్యులేషన్ బిల్లు2019, తల్లిదండ్రులు, వృద్ధుల పౌరుల నిర్వహణ, సంక్షేమం (సవరణ) బిల్లు 2019