సిటిజన్ షిప్ బిల్లు : షా హిట్లర్ సరసన చేరిపోతారు : ఓవైసీ

  • Publish Date - December 9, 2019 / 08:30 AM IST

పౌరసత్వ చట్ట సవరణ బిల్లు లోక్ సభలో ప్రవేశ పెట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అనంతరం చర్చను ప్రారంభించారు స్పీకర్. చర్చలో పాల్గొన్న ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును ఆమోదిస్తే అమిత్ షా హిట్లర్ సరసన చేరిపోతారని వ్యాఖ్యానించడంతో సభలో తీవ్ర దుమారం రేగింది. బీజేపీ సభ్యులు వ్యాఖ్యలను ఖండించారు.

సెక్యులరిజానికి ఈ బిల్లు వ్యతిరేకమని, ఈ బిల్లు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని ఓవైసీ సభకు తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. 
2019, డిసెంబర్ 09వ తేదీ సోమవారం బిల్లును షా ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడి వేడిగా చర్చ జరుగుతోంది. బిల్లు అధికరణ 5.15లకు వ్యతిరేకమని కాంగ్రెస్ సభ్యుడు రంజన్ చౌధరి చెప్పారు. దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, సమానత్వ హక్కుకు వ్యతిరేకమన్నారు. నేడు బిల్లు

ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలందరూ సభకు హాజరయ్యేలా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంది. 
ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరసత్వ చట్టం – 1955లోని నిబంధనలను సవరించడమే ఈ బిల్లు లక్ష్యం. 
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎవరైనా ఇలా వస్తే..వారిని చట్ట వ్యతిరేక కాందిశీకులుగా ముద్ర వేస్తారు. 
నిర్ధారిత సమయానికి మించి ఇక్కడే తలదాచుకున్న వారందన్నీ అక్రమ వలసదారులుగానే గుర్తించే వారు. 
ఇప్పుడు ఇలాంటి వారందరికీ భారతీయ పౌరసత్వం ఇస్తారు.
Read More :  కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు..బీజేపీ దూకుడు

ట్రెండింగ్ వార్తలు