Parliament Updates: ‘అదానీ’ వ్యవహారంపై మూడోరోజూ స్తంభించిన పార్లమెంట్.. కేంద్రంపై మండిపడ్డ కె.కేశవరావు

'అదానీ' వ్యవహారంపై పార్లమెంట్ వరుసగా మూడోరోజు స్తంభించింది. అదానీ కంపెనీలపై హిండెన్ బర్గ్ వెల్లడించిన నివేదికపై ఉభయ సభల్లో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. దీంతో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. సంయుక్త పార్లమెంటరీ సంఘం లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటు చర్చకు అనుమతి లభించకపోవడంతో విపక్ష పార్టీల నేతలు పార్లమెంటు వెలుపల నిరసన తెలిపాయి.

Parliament Updates: ‘అదానీ’ వ్యవహారంపై మూడోరోజూ స్తంభించిన పార్లమెంట్..  కేంద్రంపై మండిపడ్డ కె.కేశవరావు

Parliament Updates

Parliament Updates: ‘అదానీ’ వ్యవహారంపై పార్లమెంట్ వరుసగా మూడోరోజు స్తంభించింది. అదానీ కంపెనీలపై హిండెన్ బర్గ్ వెల్లడించిన నివేదికపై ఉభయ సభల్లో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. దీంతో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. సంయుక్త పార్లమెంటరీ సంఘం లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటు చర్చకు అనుమతి లభించకపోవడంతో విపక్ష పార్టీల నేతలు పార్లమెంటు వెలుపల నిరసన తెలిపాయి.

బీఆర్ఎస్ పార్లమెంటరి పార్టీ నేత కె.కేశవరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అదానీ వ్యవహారంపై చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ నుంచి పారిపోయిందని విమర్శించారు. మూడో రోజులుగా చర్చ జరగాలని వాయిదా తీర్మానం ఇస్తున్నా చర్చ జరపడం లేదని అన్నారు. రూల్ 267 కింద మూడు రోజులుగా నోటీసు ఇచ్చామని తెలిపారు.

ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం లేదని, ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడుస్తోందని చెప్పారు. సభ ఆర్డర్ లో లేదని వాయిదా తీర్మానాలు పరిగణనలోకి తీసుకోకుండా చర్చ జరగనివ్వకుండా ప్రభుత్వం తప్పించుకుంటుందని అన్నారు. ప్రతిపక్షాలు చర్చ కోరుకుంటున్నాయని తెలిపారు. అదానీ ప్రధాని మోదీ స్నేహితుడు కాబట్టి పార్లమెంట్ లో ప్రభుత్వం చర్చ జరగనివ్వడం లేదని అన్నారు. షేర్ల కొనుగోలు పరిధి పరిమితి పై చర్చ జరపాలని కోరుతున్నామని చెప్పారు.

ఏపీలో పోర్టులు అదానీకి కట్టబెట్టారని, ముంబై ఎయిర్ పోర్టునూ ఆయనకే కట్టబెట్టారని చెప్పారు. అదానీకి సంబంధించి అనేక అంశాలు చర్చకు రావాల్సి ఉందని, అందుకే చర్చ కోరుతున్నామని అన్నారు. అదానీ షేర్ల ధర పెంచి చూపడం, షేర్లు పడిపోవడం వంటి అంశాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదానీ స్వల్ప కాలంలో అంతటి ధనవంతుడుగా ఎలా ఎదిగారో చెప్పాలని నిలదీశారు.

దేశాన్ని దోచుకుంటుంటే దర్యాప్తు, చర్చ జరపరా? అని కె.కేశవరావు అన్నారు. అదానీ అంశంపై కేంద్రీకృతమైన చర్చ జరగాలని డిమాండ్ చేశారు. చర్చ జరిగితే షేర్లు పడిపోతాయని చర్చ జరగనివ్వడం లేదని ఆరోపించారు. అందుకే పార్లమెంటులో పూర్తి రోజును వాయిదా వేస్తున్నారని అన్నారు. ప్రభుత్వమే అదానీకి అండగా ఉన్నట్లు కమపడుతోందని చెప్పారు.

TRS MLAs Trap Case : దేశ వ్యాప్తంగా పార్టీలు మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరిపైనా సీబీఐ విచారణ జరిపించాలి : భట్టి