Parliament : నేటి నుంచే పార్లమెంట్ సమావేశాలు…కీలక బిల్లులు ఇవే

కరోనా కారణం చూపుతూ పార్లమెంట్‌లో మీడియాపై ఆంక్షలు విధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తం 36 బిల్లులను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది...

Parliament : నేటి నుంచే పార్లమెంట్ సమావేశాలు…కీలక బిల్లులు ఇవే

Parliament

Parliament Winter Session : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2021, నవంబర్ 29వ తేదీ సోమవార నుంచి ప్రారంభం కానున్న సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగనున్నాయి. పార్లమెంటు ఉభయ సభలు 20 రోజుల పాటు సమావేశం కానున్నాయి. కీలక, అతి ముఖ్యమైన వ్యవసాయ చట్టాల రద్దు, క్రిప్టో కరెన్సీ నియంత్రణ, విద్యుత్‌ చట్ట సవరణ, బ్యాంకింగ్‌ సంస్కరణ ఇతర బిల్లులను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.

Read More : Bigg Boss Telugu 5 Elimination : యాంకర్ రవికి అన్యాయం జరిగిందంటూ.. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఆందోళన

ఆదివారం ఢిల్లీలో అఖిలపక్షం సమావేశమైంది. సోమవారం నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో.. సభ జరగాల్సిన తీరుపై చర్చించింది. ఈ సందర్భంగా సాగు చట్టాలపై నిరసనల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకాలేదు. మోదీ గైర్హాజర్ పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్ చేసింది. దేశంలో రైతుల దుస్థితికి సంబంధించి…ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోందని తెలుస్తోంది.

Read More : Sonu Sood : నా గుండె బద్దలైంది.. శివశంకర్ మాస్టర్ మృతిపై సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్

అటు.. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు అధ్యక్షతన సభలోని అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్‌ల సమావేశం జరిగింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే.. పార్లమెంట్‌ సమావేశాలకు సహకరించాలని కోరారు. గతంలో సమావేశాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఈసారి సభ సజావుగా సాగేలా చూడాలని సూచించారు.

Read More : Uganda Airport : అప్పు తీర్చలేదని..ఉగాండా ఏకైక ఎయిర్ పోర్ట్ ను చైనా బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందా!

కరోనా కారణం చూపుతూ పార్లమెంట్‌లో మీడియాపై ఆంక్షలు విధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మీడియాపై ఆంక్షలు సరికాదని లేఖలో పేర్కొన్నారు.