Parliament Winter Session: ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. 13 బిల్లుల ఆమోదం

ఈ ఏడాదికి సంబంధించి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. నిర్ణీత షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందుగానే సమావేశాలు ముగియడం విశేషం. ఈ సమావేశాలు డిసెంబర్ 29 వరకు జరగాల్సి ఉంది.

Parliament Winter Session: ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. 13 బిల్లుల ఆమోదం

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశాలు మరో ఆరు రోజులు జరగాల్సి ఉంది. ఈ నెల 7న ప్రారంభమైన సమావేశాలు, ఈ నెల 29 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే, ముందుగానే సమావేశాలు ముగియడం విశేషం.

Nasal Vaccine: నేటి నుంచి నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి.. అనుమతించిన కేంద్రం

దీనికి కారణం ఉంది. రాబోయే క్రిస్మస్ వంటి పండుగలు, న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకుని సభను త్వరగా ముగించాలని పలువురు సభ్యులు కోరారు. దీంతో షెడ్యూల్‌కన్నా ముందుగానే సభను ముగించాల్సి వచ్చింది. తాజా సమావేశాలు మొత్తం 13 రోజులపాటు జరిగాయి. ఈ సమావేశాల్లో 13 బిల్లులు ఆమోదం పొందాయి. ఈ సమావేశాలు 97 శాతం ప్రగతి సాధించినట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సభలో తన ముగింపు ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సభ అనేకసార్లు నిరవధికంగా వాయిదా పడింది. ముఖ్యంగా ప్రతిపక్షాలు అనేకసార్లు సభకు ఆటంకం కలిగించాయి. ఇటీవల భారత్-చైనా సరిహద్దులో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తలెత్తిన సంగతి తెలసిందే.

Soldiers Killed: లోయలో పడ్డ సైనిక వాహనం.. 16 మంది భారత సైనికులు మృతి

ఈ అంశంపై సభలో చర్చించాలని కేంద్రాన్ని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. అయితే, ఈ అంశంపై అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. రాజ్యసభ పనితీరుపై ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప్రకటన చేశారు. ఈ సారి రాజ్యసభ 102 శాతం ప్రగతి నమోదు చేసిందన్నారు. 13 రోజులపాటు సభ నిర్వహించగా, అందులో 64.50 గంటలపాటు సభ జరిగిందన్నారు. అయితే, విపక్షాల ఆందోళనలు, నిరసనల వల్ల 01.45 గంటల సమయం వృథా అయ్యిందని పేర్కొన్నారు.