DMK : గిదేం విడ్డూరం, పార్టీ గెలువాలని చేతి వేలిని కోసేసుకున్నాడు

డీఎంకే అధికారంలోకి రావాలని కోరుతూ..గురవయ్య అనే డీఎంకే కార్యకర్త తన ఎడమ చేతి వేలిని కోసేసుకున్నాడు.

DMK : గిదేం విడ్డూరం, పార్టీ గెలువాలని చేతి వేలిని కోసేసుకున్నాడు

Dmk

Party worker cut off : తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. ఏప్రిల్ 06వ తేదీన జరిగే ఎన్నికల కోసం అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు. మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో గెలవాలని డీఎంకే, అన్నాడీఎంకే, ఇతర పార్టీల నేతలు ప్రచారంలో దూసుకపోతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్నంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2021, ఏప్రిల్ 04వ తేదీ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.

2011, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. డీఎంకే అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదరగా…డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తులు కుదిరాయి. మూడవ కూటమి ఏర్పడిన మక్కల్ నీది మయ్యం, సమత్తువ మక్కల్ కట్చి, జననాయగ కట్చిలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

అయితే..ఓ కార్యకర్త చేసిన పని అందర్నీ ఆశ్చర్యపరిచింది. డీఎంకే అధికారంలోకి రావాలని కోరుతూ..గురవయ్య అనే డీఎంకే కార్యకర్త తన ఎడమ చేతి వేలిని కోసేసుకున్నాడు. ఇదంతా ఆలయంలో జరగడంతో అక్కడున్న భక్తులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్పందించి గురవయ్యను ఆసుపత్రికి తరలించారు. అసలు ఎందుకు కోసుకున్నావని ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పాడు. తనకు మొదటి నుంచి డీఎంకే పార్టీ అంటే ఇష్టమని, ఆ పార్టీ కార్యకర్తగా ఉన్నట్లు వెల్లడించారు. ఈసారి ఎలాగైనా పార్టీ అధికారంలోకి రావాలని కోరుతూ..మరియమ్మకు తన వేలిని బలి ఇచ్చినట్లు వెల్లడించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.