రైలు కూత మోగేదెప్పుడో.. ఏప్రిల్ 12 వరకు ఆగాల్సిందే? 

  • Published By: sreehari ,Published On : April 4, 2020 / 01:37 AM IST
రైలు కూత మోగేదెప్పుడో.. ఏప్రిల్ 12 వరకు ఆగాల్సిందే? 

కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. అప్పటివరకూ రైళ్లు నడిచే పరిస్థితి లేదు. కానీ, లాక్ డౌన్ ముగిసిన వెంటనే బుకింగ్స్ మొదలై రైళ్లు నడుస్తాయంటూ వస్తున్న వార్తలపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా జారీ చేసింది. ఇప్పటివరకూ అవసరం మేరకు గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ప్యాసింజర్ రైళ్లన్ని రద్దు అయ్యాయి.

రైల్వే సర్వీసులన్నీ పున: ప్రారంభంపై ఏప్రిల్ 12 తర్వాతే నిర్ణయాన్ని రైల్వే శాఖ వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రైల్వే టికెట్ల బుకింగ్ ప్రాసెస్ నిలిచిపోలేదని స్పష్టం చేసింది. సాధారణంగా ఎప్పటిలానే 120 రోజుల మందు నుంచే రైల్వే రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉందనే విషయాన్ని వెల్లడించింది. మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు మాత్రమే ప్యాసింజర్ ట్రావెల్స్ బుకింగ్స్ నిలిపివేసినట్టు తెలిపింది. ఏప్రిల్‌ 14 వరకు రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ ఆదేశాలివ్వడంతో ఆన్‌లైన్, కౌంటర్లలో రిజర్వేషన్ల ప్రాసెస్ అంతా ఒక్కసారిగా నిలిచిపోయింది. గూడ్స్, సరుకు రవాణా రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి.

వేసవి సెలవుల్లో 120 రోజుల ముందుగానే టికెట్ల బుకింగ్ రిజర్వేషన్‌ చేయించుకునే అవకాశం ఉంటుంది. అధిక సంఖ్యలో ప్రయాణికులు అడ్వాన్స్‌ రిజర్వేషన్లు చేయించుకున్నారు. ఇప్పటికే రైళ్లలో మార్చి మొదటి వారానికి వెయిటింగ్‌ లిస్ట్‌ అలానే ఉండిపోయింది. ఏప్రిల్‌ నెలలో రైళ్లలో రిజర్వేషన్లలో బెర్త్‌లు దొరికే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ పొడిగిస్తారా? లేదో ఏదొకటి స్పష్టత వస్తే తప్పా ప్రత్యేక రైళ్లను నడిపే అవకాశం ఉంటుంది. లాక్ డౌన్ ముగిసిన అనంతరం రైల్వే సర్వీసులు పున: ప్రారంభమవుతాయో లేదో తెలియాలంటే ఏప్రిల్ 12 వరకు ఆగాల్సిందే.. 

Also Read | ఏం కొనేటట్టు లేదు.. ఏం దొరికేటట్టు లేదు.. నిత్యావసర సరుకులు కొరత!