Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పోటెత్తిన ప్రయాణికులు.. గంటల తరబడి నిరీక్షణ.. ప్రయాణికుల ఆగ్రహం

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇటీవలి కాలంలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. క్యూలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. చెకింగ్ కోసం మూడు గంటలకుపైగా ఎదురు చూడాల్సి వస్తోంది. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పోటెత్తిన ప్రయాణికులు.. గంటల తరబడి నిరీక్షణ.. ప్రయాణికుల ఆగ్రహం

Delhi Airport: బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పండుగలు, సెలవుల సందర్భంగా కనిపించేంత జనం ఇప్పుడు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నిత్యం కనిపిస్తున్నారు. గుంపులుగుంపులుగా ప్రయాణికులు తమ వంత కోసం ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇటీవలి కాలంలో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.

Maharashtra: అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మహారాష్ట్ర మంత్రిపై ఇంకు చల్లిన వ్యక్తి

దీంతో విమాన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ విషయంపై పలువురు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని ‘ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు’లోని టెర్మినల్-3తోపాటు ఎయిర్‌పోర్టు అంతా ప్రయాణికులతో నిండిపోయింది. ప్రయాణికులు అక్కడే గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించేందుకు, సెక్యూరిటీ చెకింగ్ కోసం చాలా సేపు క్యూలో ఎదురు చూడాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. సెక్యూరిటీ క్లియరింగ్ కోసం కనీసం మూడు గంటలు పడుతోందని చెబుతున్నారు. గంటల తరబడి ఇలా ఎదురు చూడటం వల్ల విమానాలు కూడా మిస్సవుతున్నాయని కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు.

Maharashtra: వేధింపుల్ని అడ్డుకున్నందుకు చిన్నారిని, ఆమె తల్లిని క్యాబ్‌లోంచి తోసేసిన ప్యాసింజర్లు.. చిన్నారి మృతి

‘‘ఎయిర్‌పోర్టులో క్యూలో నిలబడటమంటే మనల్ని మనం హింసించుకున్నట్లే. ఇక్కడ సిబ్బంది నుంచి ఎలాంటి సహాయం అందదు. సరైన ప్లానింగ్ లేదు. క్యూలో ఎక్కువ సమయం నిలబడటం వల్ల విమానాలు మిస్సవుతున్నాయి. ప్రయాణికులతో గొడవలు జరుగుతున్నాయి. బ్యాటరీ కార్స్ కూడా అందుబాటులో లేవు’’ అని ఒక ప్రయాణికుడు ట్వీట్ చేశాడు. ప్రయాణికుల నుంచి ఇక్కడి రద్దీ గురించి ఇటీవలి కాలంలో ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో కేంద్ర విమానయాన శాఖ, ఢిల్లీ ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థలు స్పందించాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు నాలుగంచెల ప్రణాళికను రూపొందించాయి. దీని ప్రకారం అదనపు ఎక్స్-రే మెషీన్లను, ఏటీఆర్ఎస్ మెషీన్లను అందుబాటులోకి తేవడం, అదనంగా మరో రెండు గేట్లను ప్రయాణికులు వినియోగించేలా చేయడం వంటి మార్పులు తీసుకురానున్నారు.